Chandrababu Naidu : చంద్రబాబు మాటలు జీవితకాలం ఆలస్యంగా ఉంటాయి. వారం, వర్జ్యం చూసుకొని మాట్లాడతారు. తనకు ప్రయోజనం అనుకుంటేనే కామెంట్స్ చేస్తారు. లేకుంటే మాటలను పొదుపు చేస్తారు. ఇతరుల వల్ల తనకు ప్రయోజనం కలగాలని భావిస్తారు. కానీ తన నుంచి ఇతరులకు ఏ లాభం దక్కకూడదన్నది చంద్రబాబు భావన. గత పదిరోజులుగా మిత్రుడుగా భావిస్తున్న పవన్ పై అధికార పక్షం ముప్పేట దాడి చేస్తుంటే పత్తాలేకుండా వ్యవహరించిన చంద్రబాబు.. తిరుబాటుగా స్పందించారు. వారాహి రెండో విడత యాత్ర మరికొద్ది గంటల్లో ముగిస్తారనగా సీరియస్ ముఖం పెట్టుకొని మీడియా ముందుకొచ్చారు.
ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో ప్రతిఒక్కరూ మాట్లాడాలని పవన్ ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై కూడా ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణికి అవమానం జరిగితే.. ఆయనొక్కడే రియాక్డు కాకూడదని.. జనసేన అభిమానులపై దాడులు జరిగితే తనొక్కడినే స్పందిస్తే సరిపోదని కూడా పవన్ అన్నారు. ఇటువంటి ఆలోచింపజేసే మాటలతో పవన్ ప్రజలను తట్టిలేపుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తనలో ఉన్న పాత వాసనలు చంపుకోలేదు. ఇలా వారాహి యాత్ర ముగిస్తుందనగా.. మీడియా కవరేజ్ మొత్తం తన వైపు మళ్లాలని మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మాట్లాడారు.
పవన్ వలంటీర్ల వ్యవస్థపై మాట్లాడే క్రమంలో మహిళల అదృశ్యం గురించి మాట్లాడారు. ఒకరోజుతో దానిని ముగించలేదు. వ్యవస్థలో లోపాలు, పర్యవసానాలు, కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలు.. ఇలా అన్ని గణాంకాలతో వివరించే ప్రయత్నం చేశారు. అటువంటి సమయంలో పవన్ కు అనుకూలంగా ప్రకటన చేస్తే అధికార పక్షాన్ని ఇరుకున పడేయవచ్చు.కానీ చంద్రబాబు అలా చేయలేదు. అలాచేస్తే పవన్ కు ఎక్కడ మైలేజీ వస్తుందోనన్న భయం చంద్రబాబుది. అందుకే ఇలా వారాహి యాత్ర ముగుస్తుందన్న గంటల ముందు స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 55 వేల మంది మహిళలపై అకృత్యాలు జరిగాయని గణాంకాలతో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ కామెంట్స్ నాడు పవన్ తో పాటు చేసి ఉంటే ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్లేవి. కానీ పవన్ కు పొలిటికల్ మైలేజ్ వస్తుందన్న భయంతోనే చంద్రబాబు వెనక్కి తగ్గారు. అసలు సిసలైన నికర్సయిన రాజకీయ నాయకుడు అనిపించుకున్నారు.