Akira Nandan AI: కృత్రిమ మేధ అద్భుతాలు చేస్తుంది. మనం ఇచ్చే సమాచారం ఆధారంగా AI సృష్టించే మనుషులు, వస్తువులు మెస్మరైజ్ చేస్తున్నాయి. రామాయణంలో రాముడు వర్ణన ఆధారంగా ఆయన ఎలా ఉండేవారో కృత్రిమ మేధ రూపం గీసి చూపిస్తుంది. AI వినియోగం సామాన్యుల వద్దకు వచ్చేసింది. ఇది ఆశ్చర్యం కంటే ఆందోళన కలిగిస్తుంది. కృత్రిమ మేధను ఉపయోగించి మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు అత్యంత సహజంగా చేయవచ్చు. ఇక AI వినియోగంతో మనుషులకు పనిలేకుండా పోతుంది. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
కాగా రేణు దేశాయ్ కొడుకు అకీరా కృత్రిమ మేధ ఆధారంగా రెండు ఆమె ఫోటోలు రూపొందించాడు. సదరు ఫోటోలను రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో వీడియో రూపంలో పోస్ట్ చేశారు. అకీరా నా ఫోటోలు AI లో ఇలా సృష్టించాడంటూ కామెంట్ పెట్టిన, రేణు దేశాయ్, ఇది ఒకరకంగా భయపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

అకీరా ప్రస్తుతం టీనేజ్ లో ఉన్నాడు. ఒక ప్రక్క చదువుకుంటూనే మరోపక్క కళలు నేర్చుకుంటున్నాడు. మ్యూజిక్ లో అకీరా ప్రావీణ్యం సాధించాడు. పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు. అప్పుడే ఓ షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకీరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అకీరా హీరో కావాలని ఆశపడుతున్నారు. అయితే అకీరా పవన్ వారసుడు అంటే రేణూ దేశాయ్ కి నచ్చదు. ఆమె ఫైర్ అవుతారు.
వాళ్ళ అభిరుచి ఆధారంగా ప్రోత్సహిస్తాను అని ఆమె అంటారు. మరోవైపు రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ కీలక రోల్ చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా విడుదల కానుంది. ఇది స్టూవర్టుపురం గజదొంగ బయోపిక్. కెరీర్ కోసం పూణే నుండి రేణు హైదరాబాద్ కి మకాం మార్చారు.