Chandrababu Naidu
Chandrababu Naidu : ఏపీలో( Andhra Pradesh) విప్లవాత్మక పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని భావిస్తోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పావులు కదుపుతోంది ఏపీ ప్రభుత్వం. ఉగాది నుంచి పి ఫోర్ పాలసీని ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. పేదరికం లేని ఏపీ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : కొత్త జిల్లాల ఏర్పాటు.. చంద్రబాబు ఆలోచన అదే!
* ఇదే ప్రాధాన్యాంశం
కాగా కలెక్టర్ల సదస్సులో( collectors review meeting ) ఈసారి పి ఫోర్ అంశమే ప్రాధాన్యంగా నిలిచింది. ‘ పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ ఫార్చునర్ షిప్’.. ఇలా పి ఫోర్ గా తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే విషయాన్ని కలెక్టర్ల సదస్సులో వివరించి ప్రయత్నం చేశారు. ఇప్పటికే స్వర్ణాంధ్ర 2047 టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో పది సూత్రాలను పరిగణలోకి తీసుకున్నారు. అందులో 0 పేదరికం ఒకటి. ఆర్థిక అంతరాలు తగ్గించేందుకు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
* ఒక్క ఆర్థికంగానే కాదు
పేదరికం నిర్మూలన అంటే ఆర్థికపరమైన అంశమే కాదు. పేద కుటుంబాలకు గృహ స్థలాలు, ఇల్లు, మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, హై స్పీడ్ ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రతి కుటుంబం అభివృద్ధి చెంది పేదరికం అనేది తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తోంది.
* దాతల సహకారంతో
అయితే పేదరిక నిర్మూలన విషయంలో దాతల సహకారం తీసుకోవాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం( AP government). అందులో భాగంగానే సున్నా పేదరికం అమలు చేయాలని చూస్తోంది. ఈ పథకంలో లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా.. సహాయం చేసే ఆర్థికంగా బలమైన వారిని మార్గదర్శిగా పిలవనున్నారు. ఈ పేర్లను ప్రజల సూచనల మేరకు ఖరారు చేశారు. ఆర్థికంగా అండగా నిలిచి మార్గదర్శిలు తమకు తోచిన విధంగా నిధులతో పాటు సమయం ఉన్నవారు ఆర్థిక విషయాల్లో సలహాలు, కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలు, విద్యా ఖర్చులకు సహాయం, వ్యాపారాలకు పెట్టుబడి వంటి సహాయం కూడా అందించే అవకాశం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం.
Also Read : ఆంధ్రజ్యోతి.. చంద్రబాబుకే ఎదురెళుతోందే?