Ratan Tata Innovation Hub: అమరావతిలో( Amravati capital ) మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం అయ్యింది. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లాంచనంగా ప్రారంభించారు. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హబ్.. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని స్టార్టప్ లకు కొత్త దశ చూపనుంది. ఇప్పటికే అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో హబ్ గా నిలపాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఇన్నోవేషన్ ప్రారంభం సరికొత్త ఆశలకు చిరునామాగా మారింది. అమరావతిని క్వాంటం వ్యాలీ గా మార్చే దిశగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించడం, పెట్టుబడులను రప్పించడం, ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
రతన్ టాటా దేశానికి గర్వకారణం..
ఈ ఇన్నోవేషన్ ను( innovation) ప్రారంభించిన తరువాత చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ‘రతన్ టాటా భారతదేశానికి గర్వకారణం. దేశానికి ఏదో చేయాలన్న తపన ఎప్పుడు ఆయనలో ఉండేది. సంపాదించిన సంపదను సమాజానికి తిరిగి ఇచ్చిన మహానుభావుడు. ఆయన ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఉద్దేశంతోనే ఈ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేసాం. గతంలోనే ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే కలను నెరవేర్చాం. ఇక భవిష్యత్తులో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైన్యూర్ రావాలన్నదే మా లక్ష్యం. రాబోయే రోజులు పూర్తిగా సాంకేతిక పరమైన ఆధారమైనవే. అందుకే ఈ సరికొత్త ప్రయత్నం’ అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: ఫ్రీ బస్సుకు రద్దీ.. ఫ్రీ విద్య, వైద్యం వద్దా?
యువతకు ఉపాధి..
ఈ ఇన్నోవేషన్ ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి మెరుగుపడుతుందని మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) అభిప్రాయపడ్డారు. అమరావతి కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న క్వాంటం వ్యాలీకి ప్రపంచ స్థాయి మద్దతు అందించేందుకు ఈ ఇన్నోవేషన్ ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా ఢిల్లీ పర్యటన ముగించుకుని నారా లోకేష్ ఏపీకి చేరుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు మంత్రి నారా లోకేష్. బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయనకు కృషితోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రూపుదిద్దుకుంటుంది. మునిపెన్నడలేని విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా భారీ నిధులు వస్తున్నాయి. ఈసారి సమగ్ర శిక్ష కోసం గతం కంటే అదనంగా 432 కోట్లు నిధులు మంజూరయ్యాయి.