Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu New Project: ఏపీకి మరో భారీ ప్రాజెక్టు తీసుకొస్తున్న చంద్రబాబు సర్కార్

Chandrababu Naidu New Project: ఏపీకి మరో భారీ ప్రాజెక్టు తీసుకొస్తున్న చంద్రబాబు సర్కార్

Chandrababu Naidu New Project: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులతో విశాఖలో నవంబర్‌ 14న సదస్సు కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి నూతన ఊపిరి అందించేందుకు రెన్యూ పవర్‌ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టిన ఈ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక, పారిశ్రామికాభివృద్ధి మంత్రి నారా లోకేష్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.

ప్రకృతి ఆధారిత అభివృద్ధి..
పర్యావరణ పరిరక్షణతోపాటు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో కొత్త శక్తి వనరుల సృష్టికి దారి తీస్తాయి. సౌర, గాలి ఆధారిత విద్యుత్‌ కేంద్రాలు, బ్యాటరీ నిల్వ సదుపాయాలు, హైడ్రోజన్‌ ఎనర్జీ వంటి ఆధునిక సాంకేతికతలను కేంద్రంగా చేసుకుని ఈ పెట్టుబడులు అమలుకానున్నాయి. పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చితే వేలాదిమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి మౌలిక సదుపాయాలు మెరుగై, పరిశ్రమల విస్తరణకు బాటలు సుగమం అవుతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read: రైతన్నా తెలుసుకో… ఏం తింటారో.. అవే పండించాలి!

రాష్ట్ర ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా..
రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలో ముందంజలో ఉండే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ క్రమంలోనే రెన్యూ పవర్‌ పెట్టుబడి ఆ లక్ష్యానికి బలమైన బాట నిలవనుంది. దీర్ఘకాలం తర్వాత ఈ గ్లోబల్‌ కంపెనీ మరోసారి ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకోవటం రాష్ట్రంపై వ్యాపార సమాజ విశ్వాసం పునరుద్ధరణగా పరిగణించబడుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular