Chandrababu Arrest : మనం పువ్వు విసిరితే మనకే తిరిగి వస్తుంది..రాయి రువ్వితే మనకే తిరిగి తగులుతుంది. ఇప్పుడు ఈ సామెత చంద్రబాబుకు అక్షరాలా వర్తిస్తుంది.. ఇది అల్ రెడీ చంద్రబాబు నాయుడికి బోధపడింది. కర్మ సిద్ధాంతం అందరికీ పునరావృతమవుతోంది. జగన్ విషయంలో చంద్రబాబు వేసిన అడుగులే ఇప్పుడు ఆయనకు బలంగా తాకుతున్నాయి. 45 ఇండస్ట్రీ బాబును వెంటాడుతున్నాయి..
ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. వైఎస్ఆర్ అంత సాఫ్ట్ జగన్ కాదని చంద్రబాబుకు అర్థమైంది. నిండు ప్రెస్ మీట్లోనే చంద్రబాబును ఏడిపించేశాడు జగన్. 45 ఏళ్లలో ఎవరూ టచ్ చేయలేని చంద్రబాబును అరెస్ట్ చేసి పడేశాడు.
తాజాగా మంత్రి రోజా ఓ అరుదైన వీడియోను షేర్ చేశారు. ఇదే చంద్రబాబు సొంత పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచేసి ఆయనను గద్దె దించి సీఎం కుర్చీ ఎక్కారని… అప్పుడు తన అల్లుడైనా సరే పదవిపై దుర్భుద్దితో తన వద్ద చేరాడని.. తనను అదును చూసి బ్లేమ్ చేసి వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ వాపోయిన వీడియోను రోజా షేర్ చేశారు. దానికి కర్మ సిద్ధాంతం పాటను వినియోగించారు.
చంద్రబాబు తన రాజకీయ ఎదుగుదలలో కొన్ని పొరపాట్లు చేసిన మాట వాస్తవమే. ఎన్నో వ్యవస్థలను కూల్చారు. నాడు సొంత పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచారు. రామోజీ ఈనాడుకి వ్యతిరేకంగా మొదలైన‘ఉదయం’ పత్రికను మూసివేయించారనే అపవాదు మూటగట్టుకున్నాడు.. తోడల్లుడు దగ్గువెంకటేశ్వరరావును రాజకీయాలకు దూరం చేశారు. జగన్ ను సోనియాతో కలిసి 16 నెలల పాటు జైలు పాలు కావడంలో చంద్రబాబు పాత్ర ఉందన్నది వైసీపీ ఆరోపణ. జగన్ సైతం ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పాడు. ఒక దెబ్బ గట్టిగా కొట్టిన వాళ్లు ఆ దెబ్బ తనకు పడుతుందని గ్రహించాలని.. తమకు అవకాశం వస్తే ఎంత గట్టిగా కొడుతామో చూపిస్తామని 2017లో నంద్యాలలో ఓడిపోయినప్పుడు వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు అది చంద్రబాబుపై చేసి చూపిస్తున్నారు..
45 ఏళ్లుగా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఎక్కడ అరెస్ట్ కాకుండా.. జైలుకు వెళ్లకుండా మేనేజ్ చేసిన చంద్రబాబును ఇన్నాళ్లకు జగన్ సర్కార్ పక్కా ఆధారాలతో బుక్ చేసింది. జైలుకు పంపడానికి సిద్ధమైంది. చంద్రబాబుకు కర్మ సిద్ధాంతాన్ని జగన్ చవిచూపిస్తున్నారు. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అంటే ఇదే.. జగన్ తీరు చూస్తుంటే చంద్రబాబును అంత ఈజీగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు.
అయితే జగన్ ప్రతీకారం ఖచ్చితంగా చంద్రబాబుపై సానుభూతి కురిపిస్తుంది. ఆయనకు రాజకీయంగా మైలేజ్ వస్తుంది. వచ్చేసారి గెలుపునకు దారితీస్తుంది. ఈ పాయింట్ ను జగన్ ఎలా మరిచిపోయాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్నికల ముందర బాబును టార్గెట్ చేయడం జగన్ కు మైనస్ .. బాబుకు ప్లస్ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
కర్మ సిద్ధాంతం
ఎవడిని వదిలిపెట్టదు
చేసిన తప్పులకు అనుభవించాల్సిందే🫵#SkillDevelopmentScam#CorruptionKingCBN#ScamSterChandrababu pic.twitter.com/MO42F2b0CX— Roja Selvamani (@RojaSelvamaniRK) September 9, 2023