CM Chandrababu: చంద్రబాబు జీవితంలో తొలిసారి చేస్తున్న ఈ పని

సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. తాత్కాలిక వ్యయ పద్దులు చూపేందుకు ఈ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాతవార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. జగన్ సర్కార్ ఈ ఓటాన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. మూడు నెలల కాల పరిమితి విధించింది. అయితే ఆ బడ్జెట్ గడువు ఈనెల 31 తో ముగియనుంది. దీంతో చంద్రబాబు సర్కార్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుందని అంతా ఆశించారు.

Written By: Dharma, Updated On : July 10, 2024 10:43 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu: చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఏపీని ఎక్కువకాలం పాలించింది ఆయనే. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ట్రాక్ రికార్డు కూడా ఆయనదే. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు, నవ్యాంధ్రకు ఐదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అదే స్థాయిలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నెన్నో సంక్షోభాలను అధిగమించారు. మరెన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు చాలా రకాల హామీలు ఇచ్చారు. వాటిని ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచన చేస్తున్నారు. అందుకుగాను తన పాలనలోనే తొలిసారిగా ఓటాన్ బడ్జెట్ పెడుతున్నారు.

సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. తాత్కాలిక వ్యయ పద్దులు చూపేందుకు ఈ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాతవార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. జగన్ సర్కార్ ఈ ఓటాన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. మూడు నెలల కాల పరిమితి విధించింది. అయితే ఆ బడ్జెట్ గడువు ఈనెల 31 తో ముగియనుంది. దీంతో చంద్రబాబు సర్కార్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుందని అంతా ఆశించారు. కానీ అలా చేయలేదు. ఓటాన్ బడ్జెట్ ను మరో రెండు నెలల పాటు పొడిగించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. ఎన్నో రకాలైన పథకాలను అందిస్తానని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పేరిట పిల్లల చదువుకు ప్రోత్సాహం, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 1500 రూపాయల నగదు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, సాగు పెట్టుబడికి ప్రతి రైతుకు 20వేల నగదు సాయం.. ఇలా చాలా రకాల పథకాలను ప్రకటించారు. వీటికిభారీ స్థాయిలో కేటాయింపులు చేయాలి.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అందుకే ముందుగా పింఛన్ల పెంపును ప్రకటించారు. అందిస్తున్నారు కూడా. మరోవైపు ముందు ప్రభుత్వం వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని, నిధుల దుర్వినియోగాన్ని ఎత్తిచూపుతూ శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. ఇంకోవైపు పాలనను గాడిలో పెట్టేందుకు చూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత పథకాల పంపిణీ ప్రారంభించాలని చూస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతుండడంతో.. కేంద్ర పథకాలపై కూడా ఒక అవగాహన వస్తుంది. ఆ పథకాలకు సంబంధించి మన రాష్ట్ర కేటాయింపులను పరిగణలోకి తీసుకోనున్నారు. అందుకే రెండు నెలల ఓటాన్ బడ్జెట్ అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు.