Chandrababu Interview TV5 Murthy: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది.. కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్నారు.. ఏడాది పాటు పరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన తనకు అనుకూలంగా ఉంటే మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏబీఎన్, మహా టీవీ వంటివి సాధారణ ఫార్మాట్లో ఇంటర్వ్యూ చేయగా.. టీవీ5 మాత్రం భిన్నంగా ప్రయోగం చేసింది. టీవీ5 సీఈవో మూర్తి తొలిసారిగా చంద్రబాబుతో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా అనేక ప్రశ్నలను చంద్రబాబును అడిగారు. ఏ మాటకామాట ఏబీఎన్ వెంకటకృష్ణ రేంజ్ లో మాత్రం మూర్తి ప్రశ్నలు అడగలేకపోయారు. కేవలం చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్ ను పెంచడానికి మాత్రమే ఈ ఇంటర్వ్యూ చేసినట్టు ఉంది.. కూటమి ప్రభుత్వంలో లుకలుకలు.. ఎమ్మెల్యేల అక్రమాలు.. మంత్రుల అవినీతి వ్యవహారాలు.. కట్టు తప్పిన శాంతిభద్రతలు.. ఇతర వ్యవహారాల జోలికి పోకుండా మూర్తి అత్యంత కట్టుదిట్టంగా.. అత్యంత జాగ్రత్తగా ఈ ఇంటర్వ్యూ సాగించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఇంటర్వ్యూలో మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో టిడిపి పోటీ చేయాలి అని మూర్తి పదేపదే అడగడం.. దానికి చంద్రబాబు సరే అని చెప్పడం హైలెట్.. అయితే తెలంగాణలో పోటీ చేయడానికి కారణాన్ని కూడా పూర్తి స్వయంగా విశ్లేషించడం.. దానిని చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పడం.. అండమాన్ లో పోటీ చేసిన మీరు.. అక్కడ బిజెపితో కలిసి గెలిచిన మీరు.. తెలంగాణలో పోటీ చేయకపోవడం ఏంటని.. కచ్చితంగా తెలంగాణలో పోటీ చేసి తీరాలని మూర్తి చంద్రబాబు ఎదుట ప్రస్తావని తీసుకొచ్చారు.. మూర్తి వాదనతో ఏకీభవించిన చంద్రబాబు.. పోటీ చేస్తానని ప్రకటించారు.
భిన్న స్వరాలు
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై.. పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లు తెచ్చుకుని పరువు పోగొట్టుకున్న భారత రాష్ట్ర సమితి.. సోషల్ మీడియాలో ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం తన అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మూర్తి – చంద్రబాబు మధ్య సాగిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక చిన్న బిట్.. అది కూడా తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం ఉంది అనే అంశానికి సంబంధించిన బిట్ ను సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తోంది.
సెంటిమెంట్ రగిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నది. కానీ ఇదే కేసీఆర్ ఆంధ్రాలో పార్టీ పెట్టిన విషయాన్ని.. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆ సోషల్ మీడియా హ్యాండిల్ మర్చిపోతోంది. కెసిఆర్ అయితే ఆంధ్రాలో రాజకీయాలు చేయవచ్చని.. చంద్రబాబుకు మాత్రం తెలంగాణలో రాజకీయాలు చేసే అధికారం లేదని పరోక్షంగా గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్ సంకేతాలు ఇస్తోంది.
Also Read: Chandrababu : చంద్రబాబు ఎందుకు ఒకే రంగు దుస్తులు ధరిస్తారు? కారణాలేంటి?
అయితే కొంతమంది పెయిడ్ ట్విట్టర్ ఖాతాదారులు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం విశేషం. ఇదే 2014 ఎన్నికల్లో.. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలో.. తెలుగు దేశం పార్టీ అసెంబ్లీ స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే.. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా కెసిఆర్ అధికారాన్ని దక్కించుకోగలిగారు. 2023 లో మాత్రం కెసిఆర్ ఊహించిన దానికంటే వ్యతిరేకమైన ఫలితాలు వచ్చాయి.. మొత్తంగా సోషల్ మీడియా హాండిల్స్ ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తూ.. గులాబీ పార్టీ ఏదో జరిగిపోతుందని ఆర్భాటం చేస్తోంది. కానీ ఫీల్డ్ రియాల్టీని మర్చిపోతోంది.