CM Chandrababu: ఏపీ ప్రభుత్వం( AP government ) కేంద్రంతో చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తోంది. కేంద్రం నుంచి సైతం రాష్ట్రానికి అన్ని విధాలా సాయం అందుతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా ఎంపీల సేవలను వినియోగించుకుంటున్నారు. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు టిడిపి ఎంపీలతో సమావేశం అయ్యారు. వారికి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీలకు శాఖలు విభజించి.. రాష్ట్రానికి సంబంధించిన ఫైళ్లను, ఇతర అంశాల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చారు. అవి సత్ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి.
* వైసిపి హయాంలో ఒకరిద్దరు మాత్రమే..
గతంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ 22 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. కానీ అందులో ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్ గా ఉండేవారు. రాజ్యసభ సభ్యుల విషయానికి వస్తే విజయసాయిరెడ్డి.. లోక్సభ సభ్యుల విషయానికి వస్తే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి వంటి వారు మాత్రమే బాధ్యతలు చూసుకునేవారు. రఘురామకృష్ణం రాజు లాంటివాళ్ళు బాధ్యతలు కోరుకున్న అప్పగించేవారు కాదు. ఆయన పార్టీ అధినేతతో విభేదించింది అప్పటి నుంచే. ఢిల్లీలో కాలు మెదపాలన్న ఆ ఇద్దరు ముగ్గురు ఎంపీల అనుమతి తీసుకోవాల్సిందే. అంతలా ఉండేవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆంక్షలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం లేదు.
* కీలక భాగస్వామి కావడంతో..
కేంద్రంలో ఎన్డీఏ లో( National democratic Alliance) తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. పైగా అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు అవుతున్నాయి. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు ఏపీ వైపు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ప్రత్యుత్తరాలు అవసరం. అందుకే సీఎం చంద్రబాబు కీలక ఆలోచన చేశారు. ప్రస్తుతం ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. 14 మంది ఎంపీలు సైతం ఉన్నారు. వీరందరికీ శాఖల వారీగా బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు సంబంధించి పనులను ఆ ఎంపీలే చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి వాతావరణం. బాధ్యతల వికేంద్రీకరణ జరిగింది. ఎవరికీ ఈ విషయంలో ఇబ్బందులు ఉండవు కూడా. ఇది మంచి పరిణామం కూడా. వీలైనంతవరకు కేంద్రంతో పనులు సులువు అవుతాయి కూడా. చంద్రబాబు ఆలోచన బాగుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.