https://oktelugu.com/

Chandrababu: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్.. అకౌంట్లలోకి రూ.20 వేలు అప్పుడే

గత ఐదు సంవత్సరాలుగా వైయస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ సామ్మాన్ నిధి పేరిట పెట్టుబడి సాయాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,500, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.6 వేలు అందించేవారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను రెండు విడతల్లో, కేంద్ర ప్రభుత్వ వాటాను మూడు విడతల్లో అందజేసేవారు.అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఎన్ని విడతల్లో అందిస్తారో చూడాలి.

Written By:
  • Dharma
  • , Updated On : July 9, 2024 / 09:35 AM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: అమరావతి : ఏపీలో రైతులకు శుభవార్త. పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకుగాను ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తేనుంది.అందులో వివరాలు పొందుపరిస్తే సాగు పెట్టుబడి కింద రూ.20 వేలు అందించనుంది.ఎన్నికల హామీల్లో భాగంగా సాగు పెట్టుబడి సాయాన్ని రూ.13,500 నుంచి 20 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పేరిట సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నారు.

    * ఐదేళ్లుగా రూ. 13,500..
    గత ఐదు సంవత్సరాలుగా వైయస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ సామ్మాన్ నిధి పేరిట పెట్టుబడి సాయాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,500, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.6 వేలు అందించేవారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను రెండు విడతల్లో, కేంద్ర ప్రభుత్వ వాటాను మూడు విడతల్లో అందజేసేవారు.అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఎన్ని విడతల్లో అందిస్తారో చూడాలి.అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.14 వేలు అందించనుంది. కేంద్ర ప్రభుత్వం సైతం తన వాటాను పెంచనున్నట్లు తెలుస్తోంది.

    *ఎన్నికల్లో హామీ మేరకు..
    2019 ఎన్నికలకు ముందు సాగు పెట్టుబడి సాయం కింద రైతులకు 15 వేల రూపాయలు అందిస్తానని జగన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో పని లేకుండా తానే అంత మొత్తం అందిస్తానని హామీ ఇచ్చారు.కానీ అధికారంలోకి వచ్చాక రూ.7500 అందించేందుకు మాత్రమే పరిమితం అయ్యారు. అందుకే చంద్రబాబు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ వాటా తో కలిపి 20వేల రూపాయలు సాగు సాయం కింద అందిస్తామని హామీ ఇచ్చారు.ఆ హామీ మేరకు ఇప్పుడు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ఖరీఫ్ ప్రారంభం దృష్ట్యా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకుగాను ప్రత్యేక పోర్టల్ రూపొందించారు. అందులో వివరాలు నమోదు చేస్తే.. అర్హత ఉంటే నగదు సాయం అందుతుంది.రైతులు పత్రాలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.