Chandrababu : శ్రీలక్ష్మి బొకేను తీసుకోని చంద్రబాబు.. షాకింగ్ వీడియో వైరల్

IAS Srilakshmi ఆయన కోరిక మేరకు చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను, టిడిపి నేతలను నానా హింసలు పెట్టారు. అనేకమంది చనిపోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు ఏమీ తెలియదు అన్నట్టుగా చంద్రబాబు దగ్గరకు వెళ్తున్నారు.

Written By: NARESH, Updated On : June 14, 2024 10:57 am

Chandrababu did not take IAS Srilakshmi's bouquet

Follow us on

Chandrababu : ఏపీలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వైసీపీ నేతలు ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు. అయితే గత ఐదేళ్లుగా వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తిన అధికారులు మాత్రం ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కొత్త ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు చేసింది తప్పులే అనుకుంటే పొరపడినట్టే. అంతకుమించి రాజకీయ ప్రత్యర్థులకు వేధించడంలో సైతం ముందంజలో ఉండేవారు. అందుకే ఇప్పుడు వారిని సర్దుబాటు చేసుకునేందుకు కూడా అధికారపక్షం ఇష్టపడటం లేదు. కనీసం వారి ముఖం చూసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. వారు చేసింది తలచుకొని.. దూరం పెట్టడమే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు.

నిన్న సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. ఆ సమయంలో చాలామంది అధికారులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పూల బొకేలతో ఎదురెళ్లి చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఎక్కువ హడావుడి చేస్తున్న వారిలో జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులే ఎక్కువగా కనిపించారు. బొకేలు పట్టుకొని తమకు చంద్రబాబు అంటే ఎంతో గౌరవం అన్నట్లుగా వ్యవహరించారు. వారి తీరు చూసి తోటి అధికారులే ఆశ్చర్యపోయారు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆయన చుట్టూ తిరిగి.. ఆయన కోరిక మేరకు చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను, టిడిపి నేతలను నానా హింసలు పెట్టారు. అనేకమంది చనిపోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు ఏమీ తెలియదు అన్నట్టుగా చంద్రబాబు దగ్గరకు వెళ్తున్నారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గుర్తున్నారు కదా. జగన్ అక్రమాస్తుల కేసులో ఆమె కూడా ఒక నిందితురాలు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు జగన్ సముచిత స్థానం ఇచ్చారు.కీలక అధికారిగా నియమించారు. నిన్న ఐఏఎస్ అధికారుల సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. ఏకంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి చంద్రబాబుకు బొకే అందించారు. కానీ ఆయన స్వీకరించలేదు. సున్నితంగా తిరస్కరించారు. రిశాంత్ రెడ్డి అనే ఐపీఎస్ అధికారి గుర్తున్నారు కదా. పెద్దిరెడ్డి ఇంట్లో పనిమనిషిలా పనిచేసి చంద్రబాబుపై రాళ్లదాడితో హత్యాయత్నం చేయించేలా కుట్రపన్నారు. అసలు పేపర్ లీక్ కాకుండానే.. లీక్ అయిందని నారాయణ స్కూల్ సిబ్బందితో స్టేట్మెంట్ రాయించుకున్నారు. ఫోన్ ట్యాప్ చేసి మరి నారాయణను అక్రమంగా అరెస్టు చేశారు. ఇప్పుడు అదే రిశాంత్ రెడ్డి నవ్వుతూ పూల బొకేతో చంద్రబాబు ఎదుట నిలబడ్డారు. కక్ష సాధింపునకు చంద్రబాబు వ్యతిరేకం అని వారి భావన. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించదు అన్న విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి.