Chandrababu: చంద్రబాబు అవినీతి కేసులు సిబిఐకి?

చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్, లిక్కర్ స్కాం, ఇసుక విధానంపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : July 6, 2024 10:17 am

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుపై అవినీతి కేసులు ఉన్న సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వ హయాంలో ఆయనపై చాలా రకాల కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగిసిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులు పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ లభించింది. ఇప్పటికీ ఆయన బెయిల్ పైనే ఉన్నారు. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులు నిబంధనలు పాటించలేదని చెబుతూ.. కేసు పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ అయ్యింది.

ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే చంద్రబాబు పై కేసులు ఉధృతి పెరిగేది. ఇప్పటికే నమోదు చేసిన కేసుల విషయంలో సిఐడి పట్టు బిగించేది. కానీ వైసీపీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబుపై నమోదైన కేసులన్నింటినీ సిఐడి వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అవినీతి కేసులను సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందున.. సీఎంగా చంద్రబాబు ఉన్నందున.. కేసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే.. కేసులన్నింటినీ సిబిఐతో పాటు ఈడికి అప్పగించాలని జర్నలిస్ట్ బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్, లిక్కర్ స్కాం, ఇసుక విధానంపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏపీ సీఐడీ వరుసుగా కేసులు నమోదు చేసింది. చంద్రబాబును అరెస్టు చేయగలిగింది. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు చంద్రబాబు. అయితే ఈ కేసుల్లో బెయిల్ కంటే కొట్టివేతకే చంద్రబాబు ఎక్కువగా ప్రయత్నించారు. అందుకే కోర్టుల్లో బెయిల్ వచ్చేందుకు జాప్యం జరిగింది. అయితే టిడిపి అధికారంలోకి వస్తే ఈ కేసుల విషయంలో సిఐడి డ్రాప్ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే సిఐడి కేసులు వెనక్కి తీసుకోకముందే.. కేసులను సిబిఐకి అప్పగించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రాజకీయ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.