Chalapati: సోమవారం – మంగళవారం ఛత్తీస్ గడ్(Chhattisgarh), ఒడిశా (Odisha) మధ్య మావోయిస్టులకు, కేంద్ర బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇలా చనిపోయిన వారిలో ఏపీలోని చిత్తూరు జిల్లా మత్యం పైపల్లె గ్రామానికి చెందిన మా వేస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్ రెడ్డి అలియాస్ అప్పారావు కన్నుమూశారు..
ఒక ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోవడం ఇదే తొలిసారి. ఆయనపై కోటి రివార్డు కూడా ఉంది.. చలపతి తండ్రి పేరు శివలింగారెడ్డి, తల్లి పేరు లక్ష్మమ్మ. శివలింగారెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు చలపతి మూడవ సంతానం. శివలింగారెడ్డి సాధారణ రైతుగా ఉండేవాడు. ఇప్పటికీ మత్యం పైపల్లె గ్రామంలో శివలింగారెడ్డికి ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ప్రస్తుతం చలపతి సోదరుడి కుమారుడి కుటుంబం నివసిస్తోంది.. చలపతి బంగారుపాలెం లో పదో తరగతి, చిత్తూరులో డిగ్రీ ఒకేషనల్ కోర్సు చదివారు. 1990-91 మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులై అజ్ఞాతవాళ్ళకి వెళ్ళిపోయారు. మన్యం ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.. శ్రీకాకుళం – కోరా పూట్ డివిజన్ ఇన్ ఛార్జ్ గా పనిచేశారు. గెరిల్లా వార్ ఫేర్ లో అద్భుతమైన ప్రతిభ చూపారు.. రెండువేల సంవత్సర నాటికి ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, ఏవోబి స్టేట్ మిలిటరీ కమిషన్లలో సభ్యుడిగా పని చేశారు. 2010లో తోటి మావోయిస్టు అరుణను అలియాస్ చైతన్యను వివాహం చేసుకున్నారు. అయితే 2012లో చలపతి కారణంగా ఒక మావోయిస్టు అనవసరంగా కన్నుమూశాడు. దీంతో పార్టీ అతడిని డిమోట్ చేసింది. 2019లో జరిగిన ఘటనలో చలపతి భార్య అరుణ కన్నుమూసింది.
మహేంద్ర కర్మ పై దాడి ఇతడి ప్లానే
2015లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్ణ పై జరిగిన దాడిలో చలపతి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.. అయితే 2017 లో మావోయిస్టు రీజినల్ కమిటీ చీఫ్ కుడుముల వెంకటరమణ అలియాస్ రవి 2017 లో గెమ్మెలి నారాయణరావు అలియాస్ జాంబ్రి చనిపోవడంతో చలపతికి ప్రాధాన్యం పెరిగింది.. ఏకంగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగాడు. మావోయిస్టు పార్టీలో మాస్టర్ మైండ్స్ లో చలపతి కీలకంగా ఎదిగాడు. మావోయిస్టు పార్టీ నాయకుడు ఆర్కే కు అత్యంత సన్నిహితంగా చలపతి ఉండేవాడు.. పీపుల్స్ సెలబ్రేషన్ గేరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్ గా ఉన్న మడావి హిడ్మా కు చలపతి గురువుగా వ్యవహరించాడు. అయితే చలపతి ఎలా ఉంటాడనేది 2016 దాకా పోలీసులకు కూడా తెలియదు. అయితే 2016లో ఓ మావోయిస్టు చనిపోగా.. అతడి లాప్టాప్ పరిశీలించగా.. చలపతి, అతడి సతీమణి అరుణ సెల్ఫీ ఫోటో బయటికి కనిపించింది. కొన్ని వీడియోలు కూడా పోలీసులకు దొరకడంతో.. అప్పటినుంచి ఆ లొకేషన్ కోసం వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చివరికి విజయవంతమై.. సోమవారం నాటి ఆపరేషన్ చేపట్టారు. చలపతి ఆధ్వర్యంలో 2003లో ధమన్ జోడి మైన్స్ కంపెనీ పై దాడి జరిగింది. చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత కూడా చోటుచేసుకుంది. 2009లో ఏపీ గ్రేహౌండ్స్ పై చిత్రకొండ జలాశయంలో దాడి జరిగింది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యను చలపతి ప్లాన్ చేశాడు. ఇక 2011లో ఒడిశా రాష్ట్రంలోని కలెక్టర్ వినిల్ కృష్ణను మావోయిస్టులు అహహరించడం వెనక చలపతి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.