Chalapati
Chalapati: ఒక్కోసారి తాడే పామై కాటు వేస్తుందట.. వెనకటికి పెద్దలకు ఇది అనుభవంలోకి వచ్చింది కాబట్టే నానుడిగా మారింది. ఈ కాలంలోనూ ఇలా కూడా జరుగుతుందా? అనే అనుమానం మీకు రావచ్చు. కాకపోతే వెనుకటి కాలం లాగా తాళ్ళను మనం ఉపయోగించడం లేదు. ప్రతి చిన్న పనికి స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. దిగే ఫోటో నుంచి మాట్లాడే మాట వరకు ప్రతి విషయంలోనూ ఫోన్ ను ఉపయోగిస్తున్నాం. కానీ ఒక్కోసారి దాని ద్వారా చేసే పనులే అనుకోని అనర్ధాలను కలిగిస్తున్నాయి.
చత్తీస్ గడ్(Chhattisgarh) లో బిజెపి ప్రభుత్వం (Bhartiya Janata party government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. దండకారణ్యం పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకొని సమాంతర పరిపాలన సాగిస్తున్న మావోయిస్టులపై ఉక్కు పాదం మోపింది.. కేంద్ర బలగాల సహాయంతో ఆపరేషన్లను చేపడుతోంది. వరుసగా ఎన్కౌంటర్లు చేస్తూ మావోయిస్టులకు చుక్కలు చూపిస్తోంది. అగ్ర నేతలను హత మార్చుతూ… కొత్త రిక్రూట్మెంట్లు జరగకుండా ఎక్కడికిక్కడ కఠిన చర్యలు తీసుకుంటున్నది. అందువల్లే ఇటీవల కాలంలో చత్తీస్ గడ్ దండకారణ్యంలో ఎన్కౌంటర్లు విపరీతంగా జరుగుతున్నాయి. ఫలితంగానే మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. గతంలో బీజాపూర్, దంతేవాడ, సుక్మా, బస్తర్ జిల్లాల్లో దండకారణ్యాలలో మావోయిస్టులు విపరీతంగా ఉండేవారు. తెలంగాణ నుంచి కూడా రిక్రూట్మెంట్లు జరిపి ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగించేవారు. ఆంధ్రా ఒరిస్సా బార్డర్(AOB) లోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు.
ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపడంతో..
అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పాదాలు మోపడంతో కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టులు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పుడప్పుడు వారు దాడులు చేస్తున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర బలగాల దూకుడు ముందు ఏమాత్రం నిలబడలేకపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఛత్తీస్ గడ్(Chhattisgarh) లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ మావోయిస్టులకు కోలుకోలేని నష్టాన్ని చేకూర్చింది. చత్తీస్ గడ్, ఒరిస్సా సరిహద్దుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పులు, ప్రతి కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లింది. అయితే ఈసారి జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో మావోయిస్టు తొలి కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఉండటం భద్రత బలగాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి ఈ ఎన్ కౌంటర్ సోమవారం ఉదయం మొదలైంది. మంగళవారం దాకా సాగిందని తెలుస్తోంది. ఇరుపక్షాల మధ్య కాల్పులు మంగళవారం దాకా సాగాయి. ఈ ఎన్ కౌంటర్ లో 14 మంది చనిపోయారని చెబుతున్నారు. అయితే ఇందులో మావోయిస్టు తొలి కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి చనిపోయిన విధానం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సెల్ఫీ వల్లే చనిపోయారా?
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, ఆయన భార్య అరుణ మావోయిస్టు దళంలో పనిచేస్తున్నారు. అయితే చలపతి, అరుణ కలిసి 2016లో ఒక సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీ భద్రతా బలగాలకు లభించింది. దీంతో వారు ఆ లొకేషన్ ను పక్కా సమాచారంతో ట్రేస్ చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టారు. ఎదురు కాల్పులు ప్రారంభించారు. మావోయిస్టులు కూడా ప్రతి కాల్పులు మొదలుపెట్టారు. అయితే భద్రత బలగాల ముందు మావోయిస్టులు నిలువ లేకపోయారు. దీంతో మావోయిస్టులకు కోలుకోలేని షాక్ తగిలింది. చలపతి లాంటి కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోవడం మావోయిస్టు పార్టీకి దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A single selfie caught the top maoist leader
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com