Amaravati: అమరావతి రాజధాని( Amravati capital) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. భారీగా నిధులు కూడా కేటాయించింది. రోడ్డుతో పాటు రైల్వే ప్రాజెక్టులను సైతం మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి అమరావతికి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టనుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం తో పాటు ఏకంగా 25 జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు సంబంధించిన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈనెల 28న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సమక్షంలో ఒకేసారి శంకుస్థాపనలు కూడా జరగనున్నాయి. ఇది నిజంగా రికార్డ్. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టే.
* 50 ఎకరాలు కేటాయింపు..
అమరావతిలో ఆర్బిఐ తో( Reserve Bank of India) పాటు బ్యాంకులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. అందులో ఓ 12 ఎక్కరాలు రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంతో పాటు అధికారులతో పాటు సిబ్బంది క్వార్టర్స్ కోసం కేటాయించారు. మిగతా ఓ 38 ఎకరాల్లో దేశంలో పేరు మోసిన బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా బ్యాంకింగ్ సెక్టార్ అంటేనే కేంద్ర ఆర్థిక శాఖతో కూడుకున్నది. పైగా వాటి నిర్మాణాలు కూడా చాలా వేగంగా జరుపుతారు. వచ్చే రెండేళ్లలో అమరావతిలో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అదే జరిగితే ఆర్థిక శాఖ పరంగా కూడా అమరావతి జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం ఖాయం.
* వెనక్కి తగ్గిన వైసిపి..
అమరావతి విషయంలో ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ వెనక్కి తగ్గింది. వర్షాలు వచ్చే సమయంలో అమరావతికి వరద పోటు అంటూ ప్రచారం చేసేది. అయితే కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో వైసిపి ఆలోచనలో పడింది. అయితే ఇప్పుడు ఈ ఆర్థిక బ్యాంకులు అందుబాటులోకి వస్తే అమరావతిపై జరిగే వ్యతిరేక ప్రచారానికి చెక్ పడినట్టే. 2014 నుంచి 2018 మధ్య తెలుగుదేశం ఎన్డీఏలో కీలక భాగస్వామి. కానీ ఇటువంటి పరిణామాలేవి అమరావతి విషయంలో జరగలేదు. మునుపెన్నడూ లేని విధంగా అమరావతి విషయంలో కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించిన బ్యాంకులు అందుబాటులోకి వస్తే అమరావతి ఆర్థిక రాజధానిగా మిగతా రాష్ట్రాలు గుర్తించడం ఖాయం. ఎందుకంటే ఒకే చోట 25 జాతీయ బ్యాంకులు, వాటి ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు చిన్న విషయం కాదు. ఈ విషయంలో మాత్రం మిగతా రాజధానుల కంటే అమరావతి మెరుగైన స్థితిలో ఉన్నట్టే.