Chandrababu: కేంద్ర రాజకీయాల్లో చంద్రబాబు కీలకం కానున్నారా? ఎన్డీఏ సమన్వయ బాధ్యతలను ఆయనకు అప్పగించనున్నారా? ఇప్పుడు అది బిజెపికి అనివార్యమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతం కంటే బిజెపి బలం తగ్గింది. రెండుసార్లు ఈజీగా అధికారంలోకి వచ్చిన బిజెపి.. ఈసారి మాత్రం కష్టపడాల్సి వచ్చింది. తెలుగుదేశం రూపంలో ఎన్డీఏకు సహకారం అందింది. లేకుంటే ఇబ్బందికరమే. తెలుగుదేశం పార్టీతో పాటు బీహార్ లోని నితీష్ పార్టీ.. ఇండియా కూటమి వైపు మొగ్గు చూపి ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వచ్చేవి. అందుకే ఇప్పుడు బిజెపి చంద్రబాబును నమ్మదగిన మిత్రుడుగా భావిస్తోంది. దేశవ్యాప్తంగా విపక్షాలు పుంజుకుంటున్న వేళ.. ఎన్డీఏ ను మరింతగా బలోపేతం చేయాలని చూస్తోంది. అందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి మరో లెక్క అన్నట్టు అంచనా వేస్తోంది. అందుకే చంద్రబాబు సేవలను వినియోగించుకుని.. 2029 లో కూడా విజయం సాధించాలని వ్యూహం రూపొందిస్తోంది. అందులో భాగంగా కీలకమైన ఎన్ డి ఏ సమన్వయ బాధ్యతలను చంద్రబాబుకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
* నేడు హర్యానాకు బాబు
హర్యానాలో బిజెపి హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈరోజు సీఎంతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. వారితోపాటు ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ లకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. పనిలో పనిగా హర్యానాలో ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
* ఎన్డీఏ బలోపేతం బాధ్యత
గత రెండుసార్లు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అయితే అప్పుడు బిజెపి ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ను దాటింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను తో స్నేహం కొనసాగిస్తూ వచ్చింది బిజెపి. అప్పట్లో ఎన్డీఏ సమావేశాలు సైతం పెద్దగా సీరియస్ గా జరిగిన దాఖలాలు లేవు. అయితే ఈసారి అలా కాదు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీతో పాటు నితీష్ పార్టీ కీలకంగా ఉన్నాయి. అయితే నితీష్ చర్యలు చూస్తుంటే తరచూ కూటమిలను మార్చుతారన్న విమర్శ ఉంది. అందుకేచంద్రబాబు ద్వారా ఎన్డీఏ ను మరింత బలోపేతం చేయాలనిప్రధాని మోదీతో పాటు అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం.అందుకే హర్యానాలో జరిగే ఎన్డీఏ సమావేశంలో ఒక కమిటీని ఎన్నుకుంటారని.. దాని సారధ్య బాధ్యతలు చంద్రబాబుకు అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో.. ఆ పదవిని స్వీకరిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Center wants to use chandrababu like that will you agree
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com