CM Chandrababu: చంద్రబాబుకు కేంద్రం షాక్.. ఎన్ఎస్జి కమాండోస్ భద్రత తొలగింపు!

దేశంలో ప్రముఖల భద్రతను కేంద్ర సంస్థలు చూస్తుంటాయి. ముఖ్యంగా మావోయిస్టుల హిట్ లిస్టులో ఉండే ప్రముఖులకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోస్ భద్రత కల్పిస్తారు.గత 20 సంవత్సరాలుగా ఎన్ ఎస్ జి కమాండోస్ భద్రత చంద్రబాబుకు కొనసాగుతోంది. అయితే ఇప్పుడు వారి స్థానంలో సిఆర్పిఎఫ్ బలగాలు రానున్నాయి.

Written By: Dharma, Updated On : October 17, 2024 12:47 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: చంద్రబాబుకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయన భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చంద్రబాబుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ భద్రత ఉండేది.వైసీపీ ప్రభుత్వ హయాంలోఆయనపై ప్రత్యర్ధులు టార్గెట్ చేసుకున్న నేపథ్యంలో భద్రతను పెంచింది.కానీ ఇప్పుడు ఉన్నపలంగా తొలగించాలని భావిస్తోంది. జాతీయస్థాయిలో ప్రముఖుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతపై కూడా మార్పులు చేయనుంది.ఇప్పటివరకు ప్రముఖుల భద్రత కోసంనేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలను వినియోగించేవారు.ఇకనుంచి వారిని భద్రతా విధుల నుంచి తప్పించాలని నిర్ణయించారు.వారి స్థానంలో సిఆర్పిఎఫ్ బలగాలకు వీఐపీల భద్రత బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం రాజధాని నిర్ణయం తీసుకుంది.సీఎం చంద్రబాబుతో పాటు జాతీయస్థాయి నాయకుల భద్రత మారనుంది.ఇకనుంచి పారా మిలటరీ వారికి భద్రత కల్పించడం ఉంది.దీనిపై కేంద్ర హోమ్ శాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది.అయితే రెండు దశాబ్దాలుగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోల భద్రత చంద్రబాబుకు కొనసాగుతూ వచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో దానికి బ్రేక్ పడనుంది.

అలిపిరి దాడి నుంచి
1998లో తిరుపతి వెళుతున్న చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగింది. అలిపిరి ఘాట్ వద్ద క్లైమరోమెన్స్ పెట్టి చంద్రబాబు కారును నక్సలైట్లు పేల్చివేశారు. అయితే అది బుల్లెట్ ప్రూఫ్ కావడంతో చంద్రబాబు ప్రాణాలు దక్కించుకున్నారు. అప్పటినుంచి మావోయిస్టుల హిట్ లిస్టులో చంద్రబాబు ఉండడంతో కేంద్రం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోల భద్రత కల్పించింది. అయితే తాజాగా ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ను ఉగ్రవాద చర్యల నిషేధానికి మాత్రమే వినియోగించనున్నారు.నక్సలైట్ల నియంత్రణ బాధ్యతలనుప్రస్తుతం సిఆర్పిఎఫ్ చూస్తోంది. అందుకే చంద్రబాబు భద్రతను సైతం సీఆర్పీఎఫ్ కి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ కు ఆరు బెటాలియన్లు ఉన్నాయి. వాటిని ఏడింటికి పెంచాలని నిర్ణయించారు.

* మరో నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి
వీఐపీల రక్షణ బాధ్యతలను సిఆర్పిఎఫ్ కు అప్పగించే ప్రక్రియను మరో నెల రోజుల్లో పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, చత్తీస్గడ్ మాజీ సీఎం రామన్ సింగ్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం గులాబ్ నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు భద్రత బాధ్యతలను ఇకనుంచి సిఆర్పిఎఫ్ చూడనుంది.