https://oktelugu.com/

Actor Radhika Apte: BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాధికా ఆప్టే.. ఆమె కడుపును చూసి ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్..

వివాహం జరిగి దాదాపు 12 సంవత్సరాల తర్వాత రాధికా ఆప్టే తల్లికాబోతోంది. అయితే ఈ విషయం ఆమె అధికారికంగా ప్రకటించలేదు. బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బేబీ బంప్ ను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

Written By:
  • Mahi
  • , Updated On : October 17, 2024 / 12:48 PM IST

    Actor Radhika Apte

    Follow us on

    Actor Radhika Apte: రాధికా ఆప్టే గురించి భారతీయులకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె దేశంలో ప్రముఖ భాషల చిత్రాల్లో నటించి మెప్పించారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర, రక్త చరిత్ర సీక్వెల్ లో ఆమె నటించి మెప్పించారు. ఆ తర్వాత ఇండియా క్రికెట్ మాజీ కేప్టెన్ బయోపిక్ అయిన ‘ధోనీ’లో కూడా కనిపించారు. రాధికా కాలేజీ రోజుల్లో నుంచే సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఇలా ఆమె మొదటి సినిమా ‘లైఫ్ హోతో ఐసీ’. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్ పొందిన భారతీయ నటుల్లో రాధికా ఆప్టే మొదటిది కావడం విశేషం. రాధికా ఆప్టే బుధవారం (అక్టోబర్ 16) BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తను నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ సినిమా ప్రదర్శనకు హాజరైంది. అయితే అక్కడ ఆమె తన పెద్ద బేబీ బంప్‌ను చూపించి ఫాన్స్ ను ఆశ్చర్య పరిచింది. బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దిగిన ఫొటోలను రాధిక సోషల్ మీడియాలో పంచుకున్నారు. కానీ ఆమె గర్భం గురించి ప్రస్తావించలేదు. తన పోస్ట్ కు ‘SISTER MIDNIGHT UK ప్రీమియర్ #lff2024’ అని మాత్రమే ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ఆమె ఒంటరిగా, రెడ్ కార్పెట్‌పై ఫోజులిచ్చింది. రాధిక నలుపు, ఆఫ్ షోల్డర్ మిడి డ్రెస్ వేసుకుంది. జుట్టును కట్టుకుంది. రాధికా కడుపుతో ఉండడంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘ఓమ్!!! ఆమె గర్భవతి, ఎంత ఉత్సాహంగా ఉంది’ అని ఒక అభిమాని రాశాడు. ‘ప్రీమియర్, మీ ప్రెగ్నెన్సీకి అభినందనలు! మీరు రెడ్ కార్పెట్ పై అద్భుతంగా ఉన్నారు’ అని మరొకరు కామెంట్ చేశాడు.

    ఆమె భర్త ఎవరు?
    రాధిక బ్రిటీష్ వయోలిన్ ప్లేయర్, స్వరకర్త బెనెడిక్ట్ టేలర్‌ను 2012లో వివాహం చేసుకుంది. తమ కెరీర్ కోసం ఈ జంట లండన్, ముంబై జర్నీ చేస్తూ కాలం గడుపుతుంది. రాధికా, ఆమె భర్త ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో ఉన్నా కూడా లో ప్రొఫైల్ మెయింటెన్ చేసేందుకే ఇష్టపడతారు. రాధిక 2011లో కాంటెంపరరీ డ్యాన్స్ నేర్చుకోవడానికి లండన్ వెళ్లిన సమయంలో బెనెడిక్ట్ టేలర్ ను కలిసింది. ఒకరికి ఒకరు నచ్చడంతో జీవితంలో కలిసి నడవాని నిర్ణయించుకున్నాడు. 2013లో అధికారికంగా వేడుక చేసుకునే ముందు 2012లో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

    రాధికా ఆప్టే ప్రాజెక్టులు..
    రాధికా ఆఫ్టే ఇటీవల శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి నటించిన ‘మెరీ క్రిస్మస్’ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించింది. ఐఆర్ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వచ్చిన కీతి సురేష్‌తో పాటు రాధిక రివెంజ్ థ్రిల్లర్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్‌కి రచయిత-దర్శకుడు ధర్మరాజ్ శెట్టి. ‘సిస్టర్ మిడ్‌నైట్’ తన కెరీర్ లో బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకచ్చింది రాధికా. కామెడీతో సాగే థ్రిల్లర్ అని వివరించింది. దీనికి కరణ్ కంధారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఈ ఏడాది మేలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.