https://oktelugu.com/

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

సినీ తార నయనతార, విజ్ఞేశ్ జంట తిరుమలలో సందడి చేసారు. శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమలకు చేరుకున్న నయనతార విజ్ఞేశ్ లు రాత్రి శ్రీపద్మావతి వసతి సముదాయాల్లో బస చేసి…. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నయనతార., విజ్ఞేశ్ లకు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన నయనతారను చూసిన భక్తులు ఆమెతో సెల్ఫీలు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 27, 2021 / 12:31 PM IST
    Follow us on

    సినీ తార నయనతార, విజ్ఞేశ్ జంట తిరుమలలో సందడి చేసారు. శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమలకు చేరుకున్న నయనతార విజ్ఞేశ్ లు రాత్రి శ్రీపద్మావతి వసతి సముదాయాల్లో బస చేసి…. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నయనతార., విజ్ఞేశ్ లకు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన నయనతారను చూసిన భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకొనే ప్రయత్నం చేసారు.

    తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శక…నిర్మాతలు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు., ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల దిల్ రాజు మాట్లాడుతూ….మహర్షి సినిమాకు జాతీయ అవార్డు రావడంతో చిత్ర దర్శకుడు వంశీతో కలసి స్వామి వారిని దర్శించుకున్నామని అన్నారు.విజయ్ దళపతితో ఓ సినిమా వంశీ దర్శకత్వంలో నిర్మిస్తున్నమని తెలిపారు.అనంతరం వంశీ పైడిపల్లి మాట్లాడుతూ….దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ దళపతితో సినిమా సినిమా చిత్రీకరిస్తున్నమని తెలిపారు. శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చామన్నారు.అందరికి నచ్చేలా సినిమా ఉంటుందని పేర్కొన్నారు.