Cartoonist Sridhar: కందకు లేని దూల కత్తిపీటకు ఎందుకు? అనేది ఒక సామెత. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే సామెత గుర్తుచేస్తోంది. ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ కు కూటమి ప్రభుత్వం సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఎన్టీఆర్ను పదవి నుంచి దూరం చేసేందుకు ఈనాడు ఎంతో దోహద పడిందని.. అప్పట్లో కార్టూనిస్ట్ శ్రీధర్ లబ్ధి చేకూర్చినందుకే ఇప్పుడు సలహాదారు పదవి ఇస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఆ వాదనలో ఎంతవరకు వసలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ వెన్నుపోటు అనేది ఎన్నడో జరిగిపోయింది. దానిని గుర్తుచేసే.. గుర్తుంచుకునే పని తెలుగు నాటలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ను సొంత కుటుంబీకులే మరిచిపోయారు. ఆయన తప్పుడు నిర్ణయాలకు మూలంగా ఆయనను వ్యతిరేకించారు. అందులో ఎటువంటి రీలైజేషన్ లేదు. కానీ ఎందుకో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ రీజన్ పై ఫోకస్ చేస్తోంది. చంద్రబాబును విమర్శించడం అనే పరిస్థితికి వస్తే ఎన్టీఆర్ను నమ్ముకోవడం అనేది సహేతుకం కాదు.
* చంద్రబాబు దక్షత..
నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే అదే తెలుగుదేశం నాలుగు దశాబ్దాల పాటు ఉనికి చాటుకుంది అంటే.. అందుకు కారణం మాత్రం వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు. ఎన్టీఆర్ కేవలం 12 సంవత్సరాలు పాటు మాత్రమే తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకున్నారు. కానీ చంద్రబాబు మూడు దశాబ్దాల పాటు ఆ పార్టీని నడిపించారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పార్టీ ఓడిపోయిన ప్రతిసారి ప్రతిపక్ష నేత అయ్యారు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు అనేది నేటి తరానికి తెలిసిన నిజం. దానికి తగ్గట్టు రాజకీయాలు చేయాలే కానీ.. ఎన్టీఆర్ పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకోవడం నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగదు కూడా. ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు కూడా.
* ఎన్టీఆర్ తో పాటు ఈనాడు..
1982లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు. అప్పుడప్పుడే తెలుగు నాట పురుడు పోసుకొని పాఠకులను ఆకట్టుకుంటుంది ఈనాడు. అలా ఆ పత్రిక దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది. అయితే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు ప్రజల్లోకి వచ్చిన మరుక్షణం.. ఆయన ఇమేజ్ పెరగడమే కాదు.. సమాంతరంగా ఈనాడు పత్రిక ఇమేజ్ కూడా పెరిగింది. నందమూరి తారక రామారావు పర్యటనలను పతాక శీర్షిక కథనాలు ప్రచురించింది ఈనాడు. అలా తెలుగు ప్రజలకు అతి దగ్గరగా మెలిగింది. ఎంతలా అంటే ఈనాడులో వచ్చిన కథనం కరెక్ట్ అన్నట్టు పరిస్థితి మారింది. అయితే 1995 వరకు అదే సీన్ కొనసాగించింది. అయితే ఈనాడు అంత ఇమేజ్ పెంచుకోవడానికి కారణం అందులో పనిచేసే ఎడిటోరియల్ స్టాఫ్. అంతకుమించి రామోజీరావు పనితీరు. అప్పటివరకు ఉన్న పత్రికలకు ధీటుగా.. ప్రజాభిమానాన్ని, పాఠక ఆసక్తిని గుర్తించింది ఈనాడు . అలా చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు కారణం అయ్యింది.
* రాజకీయ కోణంలో చూడలేం..
ఈనాడును ఒక్క రాజకీయ కోణంలోనే చూడలేం. ఎన్నో ప్రత్యేకతల సారం ఆ పత్రిక.. ఏ ప్రయోగం చేసినా సక్సెస్. సరికొత్త కథనాలు సెన్సేషన్. ప్రతి కథనానికి తగ్గట్టుగా పేజినేషన్. ఆపై శ్రీధర్ కార్టూనిస్టులు ప్రత్యేకం. అయితే ఒక వార్తకు ఫోటో ప్రామాణికం మాదిరిగా.. ఈనాడు కథనానికి శ్రీధర్ కార్టూన్ అంతే ప్రత్యేకం. కథనం రాసిన జర్నలిస్ట్ కంటే.. అదే కథనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిన కార్టూనిస్ట్ శ్రీధర్ కూడా ఒక ప్రత్యేకమే. అయితే శ్రీధర్ అనే కార్టూనిస్ట్ ఒక్క ఈనాడు కే కాదు. యావత్ భారతదేశానికి ఉన్న మీడియా రంగానికి ఒక ప్రత్యేకమే. అటువంటి వ్యక్తిని గుర్తించి మీడియా సలహాదారుగా చంద్రబాబు నియమించడం నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టపడని విషయమే. కానీ ఆయన ఇప్పుడు ఈనాడు కాదు. అంతకుమించి ఆయనలో మంచి నైపుణ్యం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అటువంటి వ్యక్తిని సలహాదారుగా నియమించినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకో తెలుగు నాట ఆ పరిస్థితి మాత్రం లేదు.