Jagan remarks on Pawan: ఏదైనా తమ వరకు వస్తే.. అనే మాట చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అలానే భావిస్తుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వీకెండ్ పేరిట రాసిన తన అభిప్రాయంలో.. జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే ఆ పార్టీ శ్రేణులు అదే నమ్మేస్తారు అని భావన వచ్చేలా ఆయన కొన్ని వ్యాఖ్యలు తన రాతల్లో చూపించారు. అయితే వైయస్సార్ పార్టీ కుటుంబం పైనే.. కుటుంబ మహిళలపైనే ఇలా చేస్తారా అంటూ ఏకంగా ఆంధ్రజ్యోతి కార్యాలయం పైనే దాడి చేసినంత ప్రయత్నం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతటితో ఆగకుండా ఏబీఎన్ రాధాకృష్ణను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలు అనే పదం రాధాకృష్ణ వాడారు కానీ.. అంతకుమించి వాడేసారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలో పాల్గొని… ఆర్కే మాటలు కంటే వైసిపి నేతల మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
రోజా ఓవరాక్షన్..
మాజీ మంత్రి ఆర్కే రోజా( ex minister RK Roja) అయితే సదరు మీడియా సంస్థ కార్యాలయాన్ని తగలబెట్టేస్తామని హెచ్చరించారు. ఆమె విషయంలో కామెడీ ఏంటంటే ఆమె గతంలో పోలీస్ అధికారులను ఉద్దేశించి ‘లం’ భాషను కూడా వాడారు. వాస్తవానికి మీడియా విషయంలో ఏం చెప్పినా తక్కువే. మీడియాలోకి వ్యాపార కోణంతో పాటు రాజకీయ కోణం జొరబడిన తరువాత దాని స్వరూపమే మారిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక సాక్షి గురించి ఒక్కసారి ఆలోచిస్తే.. అదో అవినీతి విష పుత్రిక. రాజకీయ ప్రత్యర్థులపై రాసే రాతలు అత్యంత జుగుప్సాకారంగా ఉంటాయి. అటువంటి మీడియా సంస్థను నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి తనపై వ్యతిరేకంగా వచ్చిన కథనం పట్టుకొని పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి పంపించారు. దాడికి ప్రయత్నిస్తే శాంతియుత నిరసన అని చెబుతున్నారు. మహిళలను గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విభాగంలోకి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను లాగారు.
ఆ విషయం మర్చిపోతే ఎలా
పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) విషయంలో జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలను ఇప్పుడు జనసైనికులు గుర్తు చేస్తున్నారు. కార్లను మార్చినట్టుగా పెళ్ళాలను మార్చేస్తున్నారు అంటూ సెటైరికల్ గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ పెళ్ళాలు పవన్ కళ్యాణ్ కుటుంబంలో మహిళలు కాదా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బాధపడుతూ ఇలా చేస్తున్నారు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా నిస్సిగ్గు గా దానిని కవర్ చేయలేదా. ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని దీనిపైన ఏకీపారేస్తున్నారు జనసైనికులు. తోడబుట్టిన సోదరిని, జన్మనిచ్చిన తల్లిని పార్టీ నాయకులతో తిట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు మహిళల గౌరవం గురించి మాట్లాడుతుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.