Bride Shocking Decision: గుమ్మాలకు కట్టిన మామిడి తోరణాలు ఆరలేదు. నవ వధువుకు పూసిన పారాణి ఆరలేదు. బంధుమిత్రుల సందడి ఇంకా తగ్గలేదు. ఉదయం వివాహం జరిగింది. వారి సంప్రదాయం ప్రకారం అదే రోజు రాత్రి శోభనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఆ నవ వధువు సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పెళ్లి ఇంట్లో కలకలం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో నవవధువు తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగించింది. సత్యసాయి జిల్లాలోని సోమదేవపల్లికి చెందిన హర్షితకు.. కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి ప్రాంతానికి చెందిన నాగేంద్ర తో సోమవారం వివాహం జరిగింది. తమ ఆచారాల ప్రకారం ఇరు కుటుంబాల సభ్యులు నూతన వధూవరులకు శోభనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గదిని పూలతో అలంకరించారు. పండ్లు, మిఠాయిలు తీసుకొచ్చారు.. సరిగ్గా ఆ సమయం రానే వచ్చింది. రాత్రి కాగానే నవ వధువు పాల గ్లాస్ తో వరుడు ఉన్న గదికి వెళ్ళింది.
Also Read: తమ్ముడూ నీకిక రాఖీ కట్టలేను.. అమ్మా నాన్న ను జాగ్రత్తగా చూసుకో..
వరుడు ఆమె ఇచ్చిన పాల గ్లాసును తీసుకున్నాడు. అందులో ఉన్న పాలు తాగాడు. గత తదుపరి కార్యక్రమం కోసం ఎదురుచూస్తుండగా.. ఇంతలోనే ఆ నవ వధువు కీలక నిర్ణయం తీసుకుంది. గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అప్పటికే ఆమె చేసిన అఘాయిత్యాన్ని చూసి తట్టుకోలేక కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే హర్షిత ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? శోభనం గదిలో వధూవరుల మధ్య ఏం జరిగింది? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. మరోవైపు హర్షిత సున్నిత మనస్కురాలని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. ఆమెకు ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవని.. వరుడు నచ్చిన తరువాతే పెళ్లి చేశామని చెప్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పలు కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు.. నూతన వరుడిని అనేక విషయాలలో ప్రశ్నించారు. హర్షిత మరణం సోమందేపల్లి లో సంచలనం సృష్టించింది.