Site icon OkTelugu

Botsa Satyanarayana: 360 రోజులు బ్రాందీ ముట్టనిదే.. వైఎస్ పై బొత్స కామెంట్స్ వైరల్

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: వైయస్ రాజశేఖర్ రెడ్డిని మహానేతగా అభివర్ణిస్తారు. ఆయన ద్వారా లబ్ధి పొందిన నేతలు ఇప్పటికీ గుర్తుచేసుకొని మరి బాధపడుతుంటారు. ఎందుకంటే 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఎంతోమంది నేతలకు రాజకీయ జీవితం అందించారు. అటువంటి అవకాశం దక్కించుకున్నారు బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లాలో రాజ కుటుంబాలు రాజ్యమేలుతున్న రోజులు అది. అటువంటి సమయంలో బీసీ నాయకుడిగా ఉన్న బొత్సను ప్రోత్సహించి.. మరో నేతగా ఉన్న సూర్యనారాయణ రాజును కాదని ఎనలేని ప్రోత్సాహం అందించారు రాజశేఖర్ రెడ్డి బొత్స సత్యనారాయణ కు. అందుకే రాజశేఖర్ రెడ్డిని మరువలేరు బొత్స సత్యనారాయణ. కానీ నిన్ననే బొత్సను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఇలా బొత్స ఏడ్చారో లేదో.. ఒక పుష్కరకాలం కిందట అదే రాజశేఖర్ రెడ్డి తో పాటు ఆయన ఫ్యామిలీ గురించి దారుణంగా వ్యాఖ్యానించారు బొత్స. అవి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నాయి.

* పీసీసీ అధ్యక్షుడి హోదాలో
రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విభేదించింది ఆయన కుటుంబం. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ తల్లి విజయమ్మ ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ అందుకు అంగీకారం తెలపకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవిని ఆశించారు బొత్స. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చారు బొత్సకు. ఈ క్రమంలో అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొత్స రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ గురించి నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి రాజశేఖర్ రెడ్డి కోసం కూడా తప్పుడు మాటలు ధ్వనించాయి.

* విజయమ్మ, షర్మిలకు కౌంటర్ ఇస్తూ..
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు సభ్యత, సంస్కారం లేదంటూ విజయమ్మతో పాటు షర్మిల ఆరోపణలు చేశారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు బొత్స. సభ్యత సంస్కారం ఎవరికి లేదు అని ప్రశ్నించారు. 365 రోజుల్లో నీ భర్త బ్రాందీ లేనిదే ఉండేవారా అంటూ నేరుగా విజయమ్మనే ప్రశ్నించారు బొత్స. జగన్ ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అవినీతిని ప్రస్తావిస్తూ వైయస్ రాజశేఖర్ రెడ్డి తన వద్ద బాధపడే వారిని కూడా చెప్పుకొచ్చారు అప్పట్లో బొత్స. అయితే తాజాగా బొత్స కన్నీటి పర్యంతం అయిన తర్వాత మాత్రమే సోషల్ మీడియాలో నాడు ఆయన రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడం ప్రారంభం అయ్యాయి. విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నాయి. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మావిగన్ ట్రెండింగ్ లో నిలిచింది. కానీ ఇప్పుడు బొత్స ఏడుపు, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ అవుతున్నాయి.

Exit mobile version