Homeఆంధ్రప్రదేశ్‌TDP government : అప్పుడు గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట.. టిడిపికి మాయని మచ్చ!

TDP government : అప్పుడు గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట.. టిడిపికి మాయని మచ్చ!

TDP government : ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మానని గాయాలు ఉంటాయి. మరపురాని సంఘటనలు ఉంటాయి. కానీ టిడిపి ప్రభుత్వ( TDP government) హయాంలో గోదావరి పుష్కరాలతో పాటు తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఒక మాయని మచ్చ. 2015, జూలై 14న గోదావరి పుష్కరాల తొలి రోజున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. ఇందులో మహిళలతో పాటు చిన్నారులే అధికంగా ఉన్నారు. తాజాగా తిరుపతిలో( Tirupati) జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదాలే అయినా.. రెండు ఘటనలు టిడిపి ప్రభుత్వ హయాంలో జరగడం విశేషం.

* పదేళ్ల కిందట పుష్కరాల్లో
నాడు టిడిపి( Telugu Desam Party) అధికారంలో ఉంది. మహా పుష్కరాల పేరుతో నెలల తరబడి అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తొలి రోజు పుష్కర స్నానాన్ని ప్రారంభించాలనుకుని భావించారు సీఎం చంద్రబాబు( Chandrababu). ఆయన పుష్కర స్నానం చేసిన కొద్దిసేపటికి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 52 మంది గాయపడ్డారు. చంద్రబాబు ప్రచార యావ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అప్పట్లో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కు( boyapati Srinivas ) పుష్కర క్రతువును చిత్రీకరించే బాధ్యతను అప్పగించినట్లు ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలోనే పుష్కర ఘాట్లో తన కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు పుష్కర స్నానం ఆచరించారు. దాదాపు రెండు గంటలపాటు ఆయన ఘాట్లోనే ఉండిపోవడంతో జన రద్దీ పెరిగిందని.. దానికి కారణంగానే ఒక్కసారిగా తూపులాట జరిగిందన్నది విపక్షాల ఆరోపణ. నాడు చంద్రబాబుతో పాటు మంత్రుల కాన్వాయ్ లో 20 వాహనాలు ఘాట్లో గంటల ఉండిపోయాయని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతాయి. అప్పట్లో చంద్రబాబు సర్కార్ రిటైర్డ్ జడ్జి సోమయాజులతో కూడిన ఏకసభ్య కమిషన్ ను వేసింది. అయితే నాటి పుష్కర వీడియోలు బయటకు రాకపోవడం విశేషం.

* ఇప్పుడు తిరుమలలో
ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం( TDP Alliance) ఉంది. ఈనెల 10 నుంచి తిరుమలలో ఉత్తర ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీకి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది టీటీడీ. అయితే ఒక్కసారిగా ఇక్కడ తొక్కిసలాట జరగడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు టీటీడీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ సాయంత్రానికి కొందరు అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

* టిడిపి హయాంలోనే
అయితే కేవలం టిడిపి ప్రభుత్వ హయాంలో( TDP government) ఇటువంటి ఘటనలు జరగడం మాయని మచ్చగా నిలుస్తోంది. చంద్రబాబుకు పాలనాథుడిగా పేరు ఉంది. కానీ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో లోపాలు వెలుగు చూస్తుండడం.. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడం మైనస్ గా మారుతోంది. అయితే ఈ ఘటన తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా పెరిగింది. దీనిని టిడిపి కూటమి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మొత్తానికి అయితే ఇటువంటి ఘటనలు ఏ ప్రభుత్వం ఉన్నా మాయని మచ్చగా నిలవడం ఖాయం. గతంలో గోదావరి పుష్కరాలు టిడిపి ప్రభుత్వానికి మైనస్ చేశాయి. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన కూటమి పార్టీల్లో కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular