AP BJP Alliances : ఏపీలో పొత్తు రాజకీయాలపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెంచారు. చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం వేళ స్పష్టత ఇవ్వనున్నారు. విన్ టూ విన్ ఫార్ములాను తెరపైకి తెచ్చారు. టీడీపీ ఎదుట కీలక ప్రతిపాదన పెట్టేందుకు కసరత్తు పూర్తిచేశారు. మిత్రపక్షాల సమావేశానికి ఏపీ నుంచి కేవలం పవన్ ను మాత్రమే పిలిచిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్డీఏలో పనిచేసిన టీడీపీని పక్కనపెట్టి మరీ జనసేనానిని పిలిచారు. దీంతో టీడీపీతో కలిసి నడిచేందుకు బీజేపీ ఇష్టం లేదని అర్ధమవుతోంది. అయితే పవన్ చర్యలు బట్టి బీజేపీ అడుగులు వేసే అవకాశాలున్నాయి.
వీలైనంత వరకూ తెలుగు రాష్ట్రాల్లో జనసేనతో మాత్రమే కలిసి వెళ్లాలని బీజేసీ స్ట్రాంగ్ డేసిషన్ కు వచ్చింది. అందుకే పవన్ కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ మిత్రపక్షాల భేటీకి ఆహ్వానించింది. పవన్ సైతం సమావేశానికి హాజరయ్యేందుకు ఉత్సాహం కనబరిచారు. ఒక రోజు ముందుగానే ఢిల్లీ చేరుకున్నారు. కీలక స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషిచేస్తానని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల గురించి పెద్దలతో చర్చిస్తానని.. ప్రధానంగా ఏపీకి ప్రాధాన్యమిస్తానని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే ఏపీ వరకే బీజేపీతో అన్నట్టు పవన్ వ్యాఖ్యలు చెబుతున్నాయి.
ఏపీ విషయానికి వచ్చేసరికి వైసీపీ విషయంలో కేంద్ర పెద్దల వైఖరి బట్టి పవన్ వ్యూహాలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని పవన్ బలంగా భావిస్తున్నారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనమైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ వైసీపీ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. మొన్నటివరకూ వైసీపీ సర్కారుకు బీజేపీ సహకారం అందించిందని పవన్ భావిస్తూ వచ్చారు. వైసీపీ పోవాలంటే మిగతా రాజకీయ పక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలని ఆకాంక్షించారు. అయితే ఇప్పుడు టీడీపీని విడిచిపెట్టి.. బీజేపీ, జనసేన మాత్రమే కలిసి నడవాలని పెద్దలు చెబితే పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఒక వేళ పవన్ టీడీపీని విడిచిపెట్టకూడదని బలంగా భావిస్తే మాత్రం బీజేపీ ఒక ఫార్ములాను బయటపెట్టే అవకాశం ఉంది. ఒకటి పవర్ షేరింగ్. రెండూ 75 అసెంబ్లీ స్థానాలు, పది ఎంపీ సీట్లు బీజేపీ, జనసేనకు ఇవ్వాలన్నదే కండీషన్. 2014 ఎన్నికల్లో బీజేపీకి 12 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలను ఇచ్చారు. అప్పట్లో జనసేన ఎన్నికల్లో పాల్గొనలేదు. అయితే ఇప్పుడు పవన్ గ్రాఫ్ పెరిగినందను జనసేనకు 50 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 25 అసెంబ్లీ సీట్లతో పాటు లోక్ సభ స్థానాలను పది కంటే ఎక్కువ తీసుకోవాలన్నదే ఈ విన్ టూ విన్ ఫార్ములా. అయితే దీనిపై పవన్ ఎలా స్పందిస్తారు? అసలు టీడీపీఅన్ని స్తానాలకు ఒప్పుకుంటుందా? లేదా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.