Bigg Boss 9 Duvvada Madhuri Promo: దివ్వెల మాధురిని దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) పెళ్లి చేసుకున్నారా? ఆమె దువ్వాడ మాదిరిగా మారారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. తెలుగులోనే అతిపెద్ద షోగా భావిస్తున్న బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు మాధురి. ఈ క్రమంలో తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ.. తన పేరును పరిచయం చేసుకుంటూ.. దువ్వాడ మాధురి అని అన్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ తో వివాహం జరిగి ఉంటుందన్నది ఒక నిర్ధారణగా తెలుస్తోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది ఈ జంట. అయితే బిగ్బాస్ నుంచి మాధురికి ఆహ్వానం అందింది. అయితే ఇప్పుడు ఆమె సెకండ్ టైం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించారు. అయితే సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇంటి పేరు మార్చుకుంటూ ప్రకటన చేశారు.
వివాదాస్పద ముద్ర..
శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ది ప్రత్యేక స్థానం. ఓటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఆయన దూకుడు చూసి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఆయన జీవితంలోకి మాధురి ప్రవేశించాక వివాదాస్పదంగా మారారు. ఈ వివాదాల క్రమంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట సెలబ్రిటీస్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఎనలేని గుర్తింపు సాధించుకున్నారు. శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటువేయగా ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు. తమ వ్యాపారాన్ని తామే సొంతంగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని ప్రచారం నడిచింది. ఇప్పుడు నిజంగానే హౌస్ లోకి ప్రవేశించారు.
వివాహం జరిగిందా?
అయితే ఇప్పటివరకు దివ్వెల మాధురీగానే ఉండేవారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి( Bigg Boss house) వెళ్లే ఆనందంలో మీ దువ్వాడ మాధురి అంటూ చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తో ఆయనకు వివాదం కొనసాగింది. ఈ క్రమంలో మాధురి ఎంట్రీ తో సీన్ మారింది. మరింతగా వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో చట్టపరమైన అంశాల తర్వాత తామిద్దరం అధికారికంగా పెళ్లి చేసుకుంటామని ఇద్దరు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏకంగా తనకు తాను దువ్వాడ మాధురిగా ఆమె పేర్కొనడం విశేషం. అంటే ఇద్దరికీ వివాహం జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. అయితే ఏ విషయం పైనైనా నిర్మొహమాటంగా చెప్పే ధైర్యం ఈ జంట సొంతం. అయితే వారి మాటలను చూస్తుంటే ఇదివరకే వివాహం జరిగినట్టు స్పష్టమవుతోంది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.