Amaravati Farmers: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో అడుగడుగున అవమానాలకు గురయ్యారు అమరావతి రైతులు. ఇక తమ పరిస్థితి అంతే అంటూ ఆవేదనతో ఉండేవారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు క్రమంగా కోరుకుంటున్నారు. చాలా నిర్ణయాలతో అమరావతి రైతులకు ఊరట నిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే కౌలు క్రమం తప్పకుండా చెల్లించింది. బ్యాంకుల ద్వారా సహాయం చేసేందుకు నిర్ణయించింది. దీనిపై అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి రాకుంటే తమ పరిస్థితి మరింత దిగజారేదని.. కానీ ఇప్పుడు ప్రభుత్వ చర్యలతో సంతృప్తి చెందుతున్నారు.
Also Read: శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని సగర్వంగా నిలబెట్టావ్!
* వైసిపి చర్యలతో ముందుకు రాని బ్యాంకులు..
ప్రస్తుతం అమరావతి రాజధాని( Amravati capital) నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో అమరావతి రైతులకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్ లపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖత వ్యక్తం చేశాయి. చంద్రబాబు పై నమ్మకంతో అడగ్గానే భూములు ఇచ్చారు అమరావతి రైతులు. అయితే అప్పట్లో వారికి కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లు పనికిరాకుండా పోయాయి. దానికి కారణం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. మూడు రాజధానుల అంశం తెరపైకి తేవడంతో ఇక్కడి ప్లాట్లపై రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకడుగు వేసాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లపై రుణాలు ఇచ్చినా తిరిగి రావన్న ఉద్దేశంతో అప్పట్లో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో అమరావతి రైతులకు ప్రభుత్వం కేటాయిస్తున్న రిటర్నకల్ ప్లాట్లకు రుణాలు ఇవ్వాలని లీడ్ బ్యాంకు గా ఉన్న యూనియన్ బ్యాంకు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇతర బ్యాంకులు సైతం రిటర్నబుల్ ప్లాట్ లకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
* రుణాలపైనే ఆశలు..
రిటర్న్బుల్ ప్లాట్ లపై( returnble flats) ఆశలు పెట్టుకొని అమరావతి రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారు. అయితే ఆ ప్లాట్లపై ఎటువంటి రుణాలు ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యారు. ఇప్పుడు లీడ్ బ్యాంక్ ఇచ్చిన ఆదేశాలతో రిటర్నబుల్ ప్లాట్ లకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో.. అమరావతి రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకారం తెలిపాయి. కానీ రుణాలు మాత్రం రావడం లేదు. దీంతో ఆ మధ్యన రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించగా పెద్ద ఎత్తున దీనిపై వినతులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు లీడ్ బ్యాంకు గా ఉన్న యూనియన్ బ్యాంక్.. అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమరావతి రైతుల రుణాలకు సంబంధించి సమస్య పరిష్కారం అయ్యింది.