Homeఆంధ్రప్రదేశ్‌Balineni Srinivas Reddy: ఆ కుట్రలను బాలినేని ఛేదించగలరా?!

Balineni Srinivas Reddy: ఆ కుట్రలను బాలినేని ఛేదించగలరా?!

Balineni Srinivas Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ( balineni Srinivas Reddy )చుట్టూ కుట్ర జరుగుతోందా? అన్ని పార్టీల్లో ఆయనకు ప్రత్యర్ధులు ఉన్నారా? ఆయన రాజకీయ ఎదుగుదలకు అడ్డుతగులుతున్నారా? అందుకే ఆయన తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న బాలినేని చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. రెండోసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే పదవి కావాలా? విశ్వసనీయతకు పెద్దపీట వెయ్యాలా? అంటే రెండో దానిని ఆయన ఎంచుకున్నారు. అలా జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక నిజమైన నాయకుడిగా, చిత్తశుద్ధితో తన బాధ్యతలను నిర్వర్తించారు. అయితే అనుకోని రీతిలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన గూటికి చేరారు. జనసేనలో తన పరిధి పెంచుకుంటున్న తరుణంలో ఆయన చుట్టూ కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..

* కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
ప్రకాశం జిల్లాలో( Prakasam district ) తెలుగుదేశం పార్టీ హవా నడుస్తున్న రోజులు అవి. ఆ సమయంలో యువజన కాంగ్రెస్లో పని చేసేవారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. 2003లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రకాశం జిల్లాలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి దృష్టిలో పడ్డారు. అలా 2004లో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో రెండోసారి ఒంగోలు అసెంబ్లీ టిక్కెట్టు సొంతం చేసుకున్నారు. రెండోసారి గెలిచేసరికి వైయస్ రాజశేఖర్ రెడ్డి బాలినేనికి పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చారు. అయితే తనకు ఇష్టమైన రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో చాలా బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో మంత్రి పదవిని వదులుకొని ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో రెండోసారి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే బాలినేనిలో నాయకత్వ లక్షణాలు చూసి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్. 2019 ఎన్నికల్లో మూడోసారి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు బాలినేని. అలా జగన్ మంత్రివర్గంలో మూడేళ్ల పాటు పదవి బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో అయిష్టంగానే వైసీపీ తరఫున నాలుగోసారి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తాను ఎంతో విశ్వసనీయత చూపితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నుంచి ఆశించిన స్థాయి గౌరవం దక్కకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు బాలినేని.

* అప్పట్లో చాలా హుందాగా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ రాష్ట్ర స్థాయి నేతల నుంచి దిగువ స్థాయి నేతల వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకునేవారు. అధికార మదంతో అనుచిత కామెంట్స్ చేసేవారు. కానీ ఒక్క బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో పల్లెత్తు మాట అనలేదు. చాలా గౌరవభావంతో మెలిగే వారు. పవన్ కళ్యాణ్ సైతం బాలినేని విషయంలో అదే గౌరవభావంతో చూసేవారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పని చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన, జనసేనలోని ఓవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెంచింది. అయినా సరే పవన్ కళ్యాణ్ బాలినేని నాయకత్వం పై నమ్మకం ఉంచి పార్టీలోకి ఆహ్వానించారు.

* ప్రకాశం జిల్లా రాజకీయాల్లో..
ప్రకాశం జిల్లా( Prakasam district ) రాజకీయాల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఆజాతశత్రువుగా కూడా పేరుపొందారు. ముఖ్యంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డితో ఆయనకు మంచి సంబంధం ఉంది. ఎంపీగా మాగుంట, ఎమ్మెల్యేతో పాటు మంత్రిగా బాలినేని ఉంటే ప్రకాశం జిల్లా వారు కనుసన్నల్లో నడిచేది. రాజకీయ ప్రత్యర్థులకు అదే కంటగింపుగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం కచ్చితంగా బాలినేని దక్కుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి కాదు. ఎందుకంటే బాలినేని సామర్థ్యం పవన్ కళ్యాణ్ కు తెలుసు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సైతం ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇది మింగుడు పడని రాజకీయ ప్రత్యర్థులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి చుట్టూ కుట్ర రాజకీయాలు మొదలుపెట్టారు.

* ముప్పేట దాడి..
ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయంలో అధికార, విపక్ష నేతల కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే బాలినేని వస్తే తన పట్టుకోవడం ఖాయమని ఆయనకు తెలుసు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాలినేని పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన రాజకీయ పతనం చెందితే చివరకు తమ వైపు చూస్తారు అన్నది ఆ పార్టీ ఆలోచన. పైగా సమీప బంధువు గురి ఎప్పుడు ఆయన పైనే ఉంటుంది. ఇంకోవైపు జనసేన లోని ఒక వర్గం సైతం.. బాలినేని రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి.. ఉద్దేశపూర్వక కుట్రలు చేస్తోంది. అందులో భాగమే బాలినేని తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం చేస్తోంది. కానీ తనపై పవన్ కళ్యాణ్ ఉంచిన నమ్మకం, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం.. ప్రకాశం జిల్లా ప్రజలకు బాలినేని నాయకత్వం పై ఉన్న ప్రగాఢ నమ్మకం వంటివి ఆయనను నడిపిస్తున్నాయి. ముప్పేట కుట్రలను ఛేదిస్తానన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు బాలినేని.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular