Balakrishna: మరోసారి నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) హాట్ టాపిక్ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి కీలక సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ తో సినీ పెద్దలు సమావేశం అయ్యారు. సినీ ఇండస్ట్రీలో పైరసీకి సంబంధించి ఈ సమావేశం నిర్వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి పెద్దలంతా హాజరయ్యారు. ఆ నలుగురు ప్రధాన హీరోల్లో బాలకృష్ణ తప్పించి.. మిగతా ముగ్గురు హాజరు కావడం చర్చనీయాంశం అయింది. అయితే వారితో వేదిక పంచుకోవడం ఇష్టం లేక బాలకృష్ణ గైర్హాజరు అయ్యారా? లేకుంటే వారే బాలకృష్ణను బహిష్కరించారా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. అయితే బాలకృష్ణ హాజరు కాకపోవడం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ అవుతోంది.
* ఆ ముగ్గురు హాజరు..
ఏపీలో గత కొద్ది రోజులుగా పొలిటికల్ డ్రామా( political drama) నడిచింది. నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన తర్వాత పెను దుమారం నడిచింది. దీనిపై చిరంజీవి స్పందించడంతో.. రకరకాల ప్రచారానికి తెర లేచింది. అయితే అసెంబ్లీలో ఆ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించడం.. ఇరు వర్గాల నుంచి పెద్దలు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. సరిగ్గా ఇటువంటి సమయంలో మూవీ పైరసీ గ్యాంగ్ ల అరెస్టు సందర్భంగా.. హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ సినీ పరిశ్రమ పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, నాగార్జున, నాని, నాగచైతన్య, నిర్మాత దిల్ రాజు తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇండస్ట్రీలో నలుగురు పెద్ద హీరోల్లో ముగ్గురు హాజరైన ఈ సమావేశానికి బాలయ్య వెళ్లకపోవడం మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది. కీలకమైన భేటీకి బాలయ్య ఎందుకు వెళ్ళలేదని సినీ అభిమానుల్లో కొత్త అనుమానం నెలకొంది. అయితే గతంలోనూ నందమూరి బాలకృష్ణ ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం అరుదు. కానీ ఇప్పుడు ప్రత్యేక సందర్భంలో కూడా ఆయన హాజరు కాకపోవడం పై రకరకాల రచ్చ నడుస్తోంది.
* అదే పనిగా వైసిపి సోషల్ మీడియా..
అయితే అదే పనిగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. బాలకృష్ణతో వేదిక పంచుకోవడం చిరంజీవికి ఇష్టం లేదని.. బాలయ్యను మెగాస్టార్ చిరంజీవి బహిష్కరించారంటూ ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఈ సమావేశానికి బాలకృష్ణ హాజరై ఉంటే వివాదానికి ఫుల్ స్టాప్ పడేది. కానీ ఆయన రాకపోయేసరికి కొత్త చర్చకు తెర లేపుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది. అయితే సినిమా షూటింగ్లలో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. అందుకే ఆయన రాలేదని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. వెంకటేష్ తో సైతం బాలకృష్ణకు మంచి అనుబంధము ఉంది. ఎట్టొచ్చి నాగార్జునతో ఆయన కలవడం చాలా అరుదు. తాజాగా చిరంజీవి ఎపిసోడ్ నేపథ్యంలో బాలకృష్ణ నొచ్చుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ పై సైతం అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే కీలకమైన ఈ సమావేశానికి మాత్రం గైర్హాజరు కావడం కొత్త చర్చకు కారణమవుతోంది. మరి దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.