https://oktelugu.com/

Monsoon : రుతుపవనాలపై బ్యాడ్ న్యూస్.. ఏపీ ప్రజలకు ఇది షాకింగ్

జూన్ 8వ తేదీన తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఈ సారి కేరళలో మరో రెండు రోజుల్లో రుతుపవనాలు చేరుకుంటే... 8, -10 తేదీల మధ్య తెలుగు రాష్ట్రాలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 1, 2023 / 10:33 AM IST
    Follow us on

    Monsoon : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అక్కడక్కడా వర్షాలు పడుతూ ఉపశమనం కలిగిస్తున్నాయి. ఒక వైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం కనిపిస్తోంది. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు, ఎండతీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అటు రుతు పవనాల రాకపై కూడా వాతావరణ శాఖ కీలక సమాచారం ప్రకటించింది. దీంతో రైతులు ఏరువాకకు సిద్ధపడుతున్నారు.

    పగలంతా ఎండ తీవ్రత.. సాయంత్రానికి మేఘావృతమై చిరుజల్లులు, ఈదురుగాలులు. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కనిపించే దృశ్యాలివి.  అధిక ఉష్ణోగ్రతలు మాత్రం నమోదవుతూ వస్తున్నాయి. మరో రెండురోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో గురువారం 15 మండలాల్లో, శుక్రవారం 302 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు ఉపల ద్రోణి కారణంగా తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పుకొచ్చింది.

    మరోవైపు రుతుపవనాల రాక గురించి వాతావరణ శాఖ ఆశగా ఎదురుచూస్తోంది.  ఒకటి రెండు రోజుల్లోనే రుతుపవనాలు కేరళకు తాకే  అవకాశముందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అల్పపీడనం బలపడి తుఫానగా మారితే రుతుపవనాల విస్తరణపై ప్రభావం చూపనుంది. ఈ నెల8, 9వ తేదీల్లో రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సీమలో ప్రవేశించిన తరువాత క్రమేణా రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా  వేస్తున్నారు. గత ఏడాది మే 30వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ 8వ తేదీన తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఈ సారి కేరళలో మరో రెండు రోజుల్లో రుతుపవనాలు చేరుకుంటే… 8, -10 తేదీల మధ్య తెలుగు రాష్ట్రాలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే అయిదు రోజుల వరకూ ఆలస్యమన్న మాట.
    Recommended Video: