Vishaka : ప్రశాంత సాగర నగరానికి ఏమైంది? గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో నేర ప్రవృత్తి గణనీయంగా పెరిగింది. భూ కబ్జాలు, కిడ్నాప్ లు, అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ నేవీ అధికారి కుమార్తెపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమె నగ్న వీడియోలు చూపి ఘాతుకానికి పాల్పడ్డారు. 20 రోజుల పాటు ఆమెకు నరకం చూపించారు. కుమార్తె నడవడికలో మార్పురావడాన్ని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా అడిగేసరికి బాలిక జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
నగరంలోని 104 ఏరియాలో నెవీ అధికారి ఒకరు అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. కుమార్తె పదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న సత్యారావు ఆ బాలికతో చనువు పెంచుకున్నాడు. ఓ రోజు బాలికను వివస్త్రను చేసి సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. తరువాత ఆ దృశ్యాలను చూపి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా చిత్రాలను స్నేహితులకు పంపించాడు. వారు సైతం బ్లాక్ మెయిల్ కు దిగుతూ బాలికను లొంగదీసుకున్నారు. ఇలా 20 రోజుల పాటు బాలికపై అఘాయిత్యం కొనసాగుతునే ఉంది.
బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించింది. చాలా నీరసంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆరాతీశారు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. వెంటనే నేవీ అధికారి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సత్యారావును అరెస్ట్ చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన నగరంలో సంచలనం రేకెత్తించింది. ఉత్తరాధి రాష్ట్రాల వారు ఎక్కువగా ఉండే విశాఖలో భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.
గత నెలలో విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే కీలక ప్రజాప్రతినిధి కుటుంబాన్నే ఆగంతకులు టార్గెట్ చేసుకున్నారు. అటు తరువాత అనుమానాస్పద మృతి ఘటనలు వంటివి చాలా జరిగాయి. దీంతో పోలీస్ శాఖ విశాఖ నగరాన్ని టాస్క్ ఫోర్స్ పరిధిలో చేర్చినట్టు ప్రకటించింది. కానీ నేరాలు అదుపులోకి రాకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. పోలీస్ శాఖ ఇప్పటికైనా గట్టి చర్యలు చేపట్టాలని సాగరనగర వాసులు కోరుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Atrocity in visakha the girl was in hell for 20 days
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com