AP Elections 2024
AP Elections 2024: ఏపీ అసెంబ్లీలో గెలుపు ఎవరిది అన్నది ఎవరు అంచనాకు రాలేకపోతున్నారు. వైసిపి ఒంటరి పోరు చేస్తుండగా.. టిడిపి, జనసేన,బిజెపి కూటమి కట్టాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం బలమైన అభ్యర్థులను బరిలో దించింది. ప్రస్తుతానికైతే కూటమి వెర్సెస్ వైసిపి అన్నట్టు పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఎవరి ఓట్లు చీల్చుతుందో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజానాడిని పట్టి ఫలితాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఆత్మ సాక్షి గ్రూప్ సర్వే చేసింది. అనూహ్య ఫలితాలను వెల్లడించింది.
ఆత్మసాక్షి సర్వే సంస్థ ఏపీలో ఈనెల 16 వరకు సర్వే చేసింది. నాలుగో విడత అంచనాలను ప్రకటించింది. ఈ సర్వే సంస్థ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని గతంలో తేలడంతో.. ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. 48.75 శాతం ప్రజా మద్దతుతో వైసిపి 97 నుంచి 118 స్థానాలు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోందని సర్వే తేల్చింది. టిడిపి కూటమికి 54 నుంచి 62 స్థానాలు వరకు మాత్రమే వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరో 24 స్థానాల్లో గట్టి ఫైట్ ఉంటుంది. అందులో 16 స్థానాల్లో వైసిపి, 8 స్థానాల్లో టిడిపి ఆధిక్యత కనిపిస్తోంది.
జిల్లాల వారీగా ఫలితాలను గమనిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఐదు, కూటమికి మూడు, రెండు చోట్ల హోరాహోరీ ఫైట్ ఉంటుంది. విజయనగరంలో వైసీపీకి ఏడు, కూటమికి రెండు.. విశాఖలో వైసీపీకి ఆరు, కూటమికి ఆరు, మూడు చోట్ల గట్టి ఫైట్… తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి 9, కూటమికి ఏడు, మరో మూడు చోట్ల గట్టి ఫైట్.. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి ఎనిమిది, కూటమికి ఐదు, రెండు చోట్ల గట్టి ఫైట్.. కృష్ణాజిల్లాలో వైసీపీకి పది, కూటమికి 5, ఒక స్థానంలో ఫైట్, గుంటూరు జిల్లాలో వైసీపీకి ఏడు, కూటమికి ఎనిమిది, రెండు చోట్ల ఫైట్, ప్రకాశం లో వైసీపీకి ఐదు, కూటమికి నాలుగు, మూడు చోట్ల గట్టి ఫైట్, నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఐదు, కూటమికి నాలుగు, ఒకచోట గట్టి ఫైట్ ఉంటుంది.
రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కనుందని ఈ సర్వే తేల్చింది. కడప జిల్లాలో వైసీపీకి ఎనిమిది, కూటమికి ఒకటి, ఒకచోట గట్టి ఫైట్… కర్నూలులో వైసీపీకి పది, కూటమికి రెండు, రెండు చోట్ల గట్టి ఫైట్.. అనంతపురంలో వైసీపీకి 9, కూటమికి మూడు, మరో రెండు చోట్ల గట్టి ఫైట్, చిత్తూరులో వైసీపీకి ఎనిమిది, కూటమి నాలుగు స్థానాల్లో గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. రాయలసీమలో వైసీపీకి 35, కూటమికి పది స్థానాలు దక్కుతాయి. దక్షిణ కోస్తాలో 55 స్థానాల్లో వైసీపీకి 27, కూటమికి 21, గోదావరి జిల్లాలో వైసీపీకి 17, కూటమికి 12, ఉత్తరాంధ్రలో వైసీపీకి 18, కూటమి 11 స్థానాల్లో గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. ఎం పి స్థానాలకు సంబంధించి వైసీపీ 16, కూటమి ఆరు చోట్ల గెలిచే పరిస్థితి ఉంది. మూడు చోట్ల మాత్రం గట్టి ఫైట్ ఉంటుందని తేలింది.