Pawan Kalyan Elephants Problem: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) ప్రజల కోసమే ఆలోచిస్తారు అనే మంచి పేరు సొంతం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను సొంతం చేసుకున్నారు. గిరిజనుల పై ఉన్న మమకారంతో అటవీ శాఖను నిర్వర్తిస్తున్నారు. అయితే అటవీ శాఖలో వినూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. అటవీ ఉత్పత్తులను కాపాడడమే కాదు.. అటవీ జంతువుల బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తేవడం, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో అటవీ జంతువులను నియంత్రించడం నిజంగా ఒక అద్భుతమే. పవన్ చర్యలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయి కూడా.
* అటవీ జంతువుల సంచారం అధికం..
ఏపీలో( Andhra Pradesh) అటవీ ప్రాంతం విస్తారంగా ఉంది. తూర్పు కనుమల నుంచి మళ్లీ నల్లమల వరకు.. విస్తారమైన అటవీ ప్రాంతం రాష్ట్రం సొంతం. ఈ తరుణంలో ఎక్కడికక్కడే అటవీ జంతువులు ప్రభావం చూపిస్తున్నాయి. ముందుగా ఏనుగుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. దశాబ్దాలుగా ఏనుగులు సమస్య కొనసాగుతూనే ఉంది. నల్లమల అడవి ప్రాంతం నుంచి వచ్చే ఏనుగులతో రాయలసీమ ప్రజలు.. ఒడిస్సా లఖేరి ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులతో ఉత్తరాంధ్రవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ వచ్చారు. విపరీతమైన ప్రాణ నష్టం జరిగేది. పంటల నష్టం అపారం. దశాబ్దాలుగా ఈ సమస్య కొనసాగుతున్న పరిష్కార మార్గం దొరకలేదు. ఏనుగుల క్యారీడర్, ఇంకా రకరకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు.
* కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు
గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చింది కూటమి. అటవీ శాఖ( Forest Department) పై అధ్యయనం చేసే క్రమంలో ఏనుగుల సమస్యను గుర్తించారు పవన్ కళ్యాణ్. దీనికి శాశ్వత పరిష్కార మార్గం చూపించాలని భావించారు. అందుకే కర్ణాటకలో ఉన్న కుంకీ ఏనుగులు తెస్తే కొంతవరకు మన ఏనుగులను నియంత్రించవచ్చని అటవీ శాఖ అధికారులు సలహా ఇచ్చారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చొరవ చూపారు. తనకున్న గ్లామర్ తో అక్కడి వారితో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపారు. అక్కడి ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా స్పందించారు. ఏపీకి నాలుగు కుంకి ఏనుగులు పంపించారు. అవి కొంతవరకు ఏనుగులు గ్రామాలపై పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా నియంత్రిస్తున్నాయి.
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో..
అయితే ఏనుగుల( elephant) సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కోసం పవన్ కళ్యాణ్ అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు ఒక కీలక సూచన చేశారు. దానిని అమలు చేయడం ప్రారంభించారు పవన్ కళ్యాణ్. అటవీ ప్రాంతాలతో పాటు ఏనుగులు సంచరించే ప్రాంతాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పరికరాలను అమర్చారు. ఏనుగులు వచ్చిన వెంటనే వాటి సమాచారం ముందుగానే అవి అటవీ శాఖ అధికారులకు చేరవేస్తున్నాయి. అటవీ శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తం అవుతున్నారు. అవి గ్రామాలపై రాకుండా ఉండేందుకు భారీ శబ్దాలు చేసే ఏర్పాట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నారు. ఈ భారీ శబ్దాలకు అవి గ్రామాలపై, పంటలపై దండెత్తకుండా నియంత్రించ గలుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ అటవీ జంతువుల నియంత్రణకు ఈ స్థాయిలో ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇదో అద్భుతం చేశారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.