Nara Lokesh: రాజకీయాల్లో( politics) ప్రతి అనుభవం అక్కరకు వస్తుంది. రాజకీయ పరిస్థితులు కూడా నేతలలో ఒక రకమైన మార్పునకు కారణం అవుతాయి. ఈ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఎలాంటి లోకేష్.. ఎలా మారారు అన్నది ప్రత్యర్థులకు తెలుసు. సొంత పార్టీ వారికి తెలుసు. ఏపీ ప్రజలకు తెలుసు. లోకేష్ ప్రతి మార్పును గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. వ్యతిరేకించిన వారే గౌరవిస్తున్నారు. వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారి ఫిదా అవుతున్నారు. ఒక నాయకుడికి ఇంతకంటే ఏం కావాలి. గోల్డెన్ స్పూన్ తో పుట్టే నాయకుడి కంటే.. గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టాలు ఎదురొడ్డి నిలిచేవాడే నిజమైన నాయకుడిగా అవతరిస్తాడు. అటువంటి ఛాన్స్ వచ్చింది నారా లోకేష్ కు. తాత ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి. తండ్రి చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పదవి అలంకరించిన వారు. మామ బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాక్టర్. అటువంటి నారా లోకేష్ ఎంట్రీ ఎలా ఉండాలి. తండ్రి చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగలిగారు. కానీ అంతే మించి రాజకీయ ప్రత్యర్థులను ఇచ్చారు. కానీ వాటన్నింటినీ దాటుకొని తనను తాను ప్రూవ్ చేసుకున్నారు నారా లోకేష్.
* అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ..
2024 ఎన్నికల వరకు లోకేష్ పై( Nara Lokesh) ఎవరికీ నమ్మకం లేదు. చివరకు సొంత పార్టీ శ్రేణులకు సైతం ఏదో ఒక మూల అపనమ్మకం. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై వచ్చారు. సొంత పార్టీతో పాటు ప్రజలలో చిన్నపాటి ముద్రతో బయలుదేరారు లోకేష్. కానీ కేంద్ర పెద్దలతో మమేకం అయిన తీరు, తన తండ్రి అక్రమ అరెస్టు సమయంలో తపన పడిన తీరు, కూటమి కట్టడంలో వ్యవహరించిన తీరు, అధికారంలోకి వచ్చిన తరువాత పాలనతో పాటు పార్టీ పై ముద్ర చాటిన తీరు… ఇలా ప్రతి అంశంలోనూ పై చేయి సాధిస్తూ వచ్చారు. ఇప్పుడు నారా లోకేష్ అంటే ఒక శక్తి, ఒక వ్యవస్థ అన్నట్టు మార్చుకున్నారు.
* భావి నాయకుడిగా ఆవిష్కరణ..
లోకేష్ తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉంటుంది. తనను తాను భావి నాయకుడిగా ఆవిష్కరించుకునే తీరు కూడా ఆకట్టుకుంటుంది. నిర్ణయాల్లో తప్పుడు వ్యవహారాలు ఉండవు. ఒకరి ప్రభావం కూడా ఉండదు. ఇటీవల జరిగిన రెండు ఘటనలే దానికి ఉదాహరణ. కాశీబుగ్గ లో ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. పదిమంది చనిపోయారు. అక్కడ గుడి కట్టింది ఓ సామాన్య భక్తుడు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరికి తిరుమల మాదిరిగా దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో నిర్మించారు. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత సదరు ఆలయ వ్యవస్థాపకుడు పై కేసు పెట్టాలని ఒత్తిడి పెరిగింది. అరెస్టు చేయాలన్న డిమాండ్ వచ్చింది. కానీ అందుకు అంగీకరించలేదు లోకేష్. అది సహేతుకం కాదని తేల్చేశారు. ఇటువంటి ప్రైవేటు దేవాలయాల విషయంలో ఒక వ్యవస్థను తేవాలని మాత్రమే చూశారు. సొంత పార్టీతోపాటు ప్రత్యర్థి పార్టీల ఒత్తిడికి ఎంత మాత్రం తలవంచలేదు లోకేష్.
* సమయస్ఫూర్తిగా..
ఏపీకి( Andhra Pradesh) చెందిన భక్తులు తమిళనాడులోని ఆలయాల సందర్శనకు వెళ్లారు. ప్రత్యేక బస్సులు వెళ్లారు. అక్కడి అల్లరి మూకాలతో పాటు ఆటో డ్రైవర్లు అడ్డగించారు. అల్లరి చేసే ప్రయత్నం చేశారు. ఆ సమస్య మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. ఇదో ప్రాంతీయ సమస్యగా మారుతుందని భావించారు లోకేష్. నేరుగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో సంప్రదించారు. జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాల మధ్య సమస్యగా మార్చవద్దని విజ్ఞప్తి చేశారు. ఉదయనిది స్టాలిన్ దీనికి సానుకూలంగా స్పందించారు. బస్సులో వెళ్ళిన ఏపీ భక్తులతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించారు. ఈ రెండు ఘటనలు లోకేష్ భావి నాయకుడిగా ఊహించడానికి ఎంత మాత్రం తక్కువ కాదు అని తేలిపోయింది. ప్రజలకు పాలన అందించడం అంటే కేవలం హోదా అనుభవించడం కాదు. వారి కష్టసుఖాల్లో.. సుఖ దుఃఖాల్లో ఉండడం అని నిరూపించారు నారా లోకేష్. నిజంగా ఇది అభినందనీయమే. ఏపీకి ఒక భావి నాయకుడు లోకేష్ రూపంలో దొరికినట్టే.