Tirumala Venkateswara Swamy: తిరుమల కొండపై కొలువైన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తుంటారు కొందరు. అయినా సరే ఆ తిరుమల చేరడం కష్టమే. ఆ స్వామి వారి ఆజ్ఞ లేనిదే మనం తిరుమల కొండ ఎక్కలేమట. ఆ స్వామి తమ కష్టాలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే.. ఎంతో శ్రమపడి ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లాలని అనుకుంటారు భక్తులు. కొందరు ఏకంగా కాలినడకన తిరుమల కి వెళ్తుంటారు. కొందరు వాహనాల ద్వారా వెళ్తుంటారు. అయితే.. తెలిసీ తెలియక కొందరు ఆ తిరుమల కొండమీద కొన్ని తప్పులు చేస్తారు. మరీ ముఖ్యంగా డైరెక్ట్ గా ఆ స్వామి వారిని దర్శించుకుంటారు. కానీ ఇలా అసలు చేయకూడదు. ఇంతకీ ఏం చేయాలి? ఎలా తిరుమల ట్రిప్ పూర్తి చేసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం.
Also Read: బ్యాటరీ సైకిల్ ని తొక్కుతూ మురిసిపోయిన పవన్ కళ్యాణ్..వైరల్ అవుతున్న ఫోటోలు!
ముందుగా తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ తిరుమలేశుడి దర్శనం చేసుకోవాలి అనుకుంటారు. కానీ స్వామి వారిని దర్శించుకోవడానికి ముందు వరాహ స్వామిని దర్శించుకోవాలి అంటున్నారు పండితులు. ఆ తర్వాతే వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలట. ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రాన్ని ఆది వరాహక్షేత్రంగా పిలుస్తారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువయ్యారట. శ్రీ విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించారు. ఆ తర్వాత తిరుమల కొండపై ఉండేందుకు తనకు వంద అడుగుల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతారు శ్రీవరాహమూర్తిని.. అప్పుడు వరాహ మూర్తి కూడా అంగీకరించి స్థలాన్ని ఇస్తారట. అప్పటి నుంచి ప్రథమ దర్శనం, పూజ, నైవేద్యం తనకే జరగాలని చెబుతుంటారు.
అంతేకాదు దీనికి శ్రీనివాసుడు సమ్మతించారని కూడా పురాణాలు చెబుతున్నాయి. తిరుమల అర్చక స్వాములు అన్ని కచ్చితమైన నియమాలు పాటిస్తున్నారు. అంటే మొదటి పూజ, నైవేద్యం ఆ స్వామి వారికే సమర్పిస్తారు. ఆ తర్వాతనే వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారట. కానీ ఈ మొదటిది పాటించాల్సింది తిరుమల వెళ్లే భక్తులు. కానీ చాలా మంది దీన్ని పాటించడం లేదు. శ్రీభూవరాహస్వామి వారిని దర్శించుకుని ఆ తర్వాత ఆ స్వామి వారి దర్శనానికి వెళ్లాలి అన్నమాట.
Also Read: టిడిపిలో ఇలా అయితే కష్టమే!
అంతేకాదు ఈ తిరుమల క్షేత్రం మహా పుణ్యక్షేత్రం. స్వామి వారి దర్శనం కోసం వెళ్లే వారు టైమ్ పాస్ కోసం, విహార యాత్ర కోసమని భావించి వెళ్లకూడదు. కొంతమంది సందర్శకులు షాపింగ్, విందులు, వినోదం ఎంజాయ్ అని వెళ్తారు. అయితే ఆ స్వామి వారి కొండ మీద ప్రాపంచిక సుఖాలను వదిలివేయాలి. అంతేకాదు మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు.. ఆరు నెలల వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదు అనే నియమం అందుకే చెప్పారు పెద్దలు. వీటితో పాటు తిరుమలలో దొంగ దర్శనాలు చేసుకోవద్దు. మాఢవీధుల్లో చెప్పులు వేసుకోవద్దు. తిరుమల వెళ్లే భక్తులు పూలకు కూడా దూరంగా ఉండాలట.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.