TDP: ఆ దీవిలో సత్తా చాటుతున్న టిడిపి.. చంద్రబాబు వ్యూహం

తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చాలని చంద్రబాబు భావించారు. అయితే తెలంగాణలో ఆ పార్టీ బలహీనంగా మారింది. అయితే అనూహ్యంగా ఒక దీవిలో సత్తా చాటుతోంది తెలుగుదేశం పార్టీ.

Written By: Dharma, Updated On : October 25, 2024 12:17 pm

TDP(1)

Follow us on

TDP: తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. మరో కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా సత్తా చాటుతూ వస్తోంది. జాతీయ పార్టీల మధ్య ఉనికి చాటుకుంటూ వస్తోంది. ఓటు శాతాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. అదే కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది ఏపీలో. 2019 ఎన్నికల్లో భారీ ఓటమితో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి తరుణంలో 2024 ఎన్నికల్లో సాలిడ్ విజయం సాధించింది. అయితే తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టిడిపి బలహీనపడడం నిజంగా లోటే. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం పుష్కరకాలంగా ఆ పార్టీ గణనీయమైన పాత్ర పోషిస్తూ.. బలం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. 2010 నుంచి కూడా అండమాన్ లో పార్టీ తనకంటూ ఉనికి చాటుతోంది. బిజెపితో జతకట్టి మంచి ఫలితాలు సాధిస్తోంది. 2019 నుంచి 2024 మధ్య ఏపీలో బిజెపితో టిడిపికి సంబంధాలు లేవు. కానీ అండమాన్ లో మాత్రం కమలనాధులతో కలిసి టిడిపి మున్సిపాలిటీల్లో అధికారం దక్కించుకుంది.

* ఓట్ల శాతం పెంచుకుంటూ..
అండమాన్ నికోబార్ దీవుల్లో 2010లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు పోటీ చేశారు. నాలుగు శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఒక మున్సిపల్ కౌన్సిలర్ కూడా విజయం సాధించారు. 2017లో జరిగిన అండమాన్ స్థానిక ఎన్నికల్లో 12 శాతం ఓట్లు సాధించింది టిడిపి. రెండు కౌన్సిలర్స్ స్థానాలను గెలుచుకుంది. 2022లో జరిగిన ఎన్నికల్లో 14% ఓటు బ్యాంకు దక్కించుకుంది. అధికారాన్ని పంచుకునే స్థాయికి చేరింది. కోర్టు బ్లేయర్ లో 24 వార్డులకు గాను బిజెపి 10, టిడిపి 2 స్థానాలు దక్కించుకున్నాయి. ఇతరులతో కలిసి అధికారంలోకి రాగలిగాయి.

* చంద్రబాబు ఫోకస్
అయితే ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావడంతో చంద్రబాబు అండమాన్ నికోబార్ దీవులపై దృష్టి పెట్టారు. అక్కడ పార్టీ బలోపేతం పై ఫోకస్ చేశారు. తాజాగా నక్కల మాణిక్యరావు అనే నేతను అధ్యక్షుడిగా నియమించారు. బలమైన నేతగా గుర్తింపు ఉన్న మాణిక్యరావు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన నియామకంతో పార్టీ బలోపేతం అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లలో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని పంచుకునే స్థాయికి చేరుకుంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి.