AP Liquor Scam : ఏపీలో మద్యం కుంభకోణంలో కీలక మలుపు. ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ హైకోర్టు తలుపు తట్టింది. ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. మద్యం కుంభకోణం పై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 29 మంది పై కేసులు నమోదు చేశారు. 12 మంది అరెస్ట్ కూడా జరిగింది. రాజ్ కసిరెడ్డి నుంచి ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వరకు అరెస్టులు కొనసాగాయి. ఒకవైపు విచారణ, మరోవైపు చార్జ్ షీట్లు కొనసాగుతుండగా మధ్యలో నిందితులకు బెయిల్ వచ్చింది. తొలుత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలతో పాటు మరొకరికి బెయిల్ లభించింది. ఇటీవల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సైతం బెయిల్ వచ్చింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ సిట్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది.
* సిట్ వాదనలు అవి
ప్రధానంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడాన్ని సిట్ తప్పు పడుతోంది. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఈ కేసులో కీలక సూత్రధారి అని సిట్ అభిప్రాయపడుతోంది. ఈ కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చాలా వరకు లాభపడ్డారని కూడా చార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి దాదాపు 72 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. మధ్యలో ఒకసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో నాలుగు రోజులపాటు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. కానీ ఈసారి మిధున్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీనిపై సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. ఈ కేసులో ప్రధాన పాత్రధారి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అని సిట్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి బయటకు వెళ్తే సాక్షాలు తారుమారు చేస్తారని.. విచారణ పై ప్రభావం చూపే అవకాశం ఉందని సిట్ వాదనలు వినిపించే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?
* లోతైన విచారణ..
మరోవైపు మద్యం కుంభకోణం కేసులో విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి పాత్రప ఆ మధ్యన విచారణ చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి స్వయాన పెదనాన్న కుమారుడు అనిల్ రెడ్డి. ఆయన కంపెనీలు వైయస్ భారతి రెడ్డి డైరెక్టర్ అని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అనిల్ రెడ్డి తల్లి పేరు కూడా భారతీ అని తెలుస్తోంది. దీంతో ఈ అంశం కొత్త మలుపు తిరిగింది. మరోవైపు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సంచలనమే. ఒకవేళ బెయిల్ ను హైకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పిన సంచలనమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.