Homeఆంధ్రప్రదేశ్‌AP Women Free RTC: ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి ఏర్పాట్లు ఇవీ

AP Women Free RTC: ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి ఏర్పాట్లు ఇవీ

AP Women Free RTC: ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం( Alliance government ). అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న క్రమంలో సంక్షేమ పథకాలపై ఫుల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే తల్లికి వందనం పథకం అమలు చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం రోజున ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేసింది. మరోవైపు తల్లికి వందనం రెండో విడత నిధులు కూడా జమ చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలు పొందిన విద్యార్థులతో పాటు ఇంటర్లో చేరిన వారికి సైతం నిధులు జమ చేసింది. అంతటితో ఆగకుండా వివిధ సాంకేతిక కారణాలతో ఈ పథకం నిలిచిపోయిన వారికి సైతం తప్పులు సరిచేసి అందించింది కూటమి ప్రభుత్వం. ఇదే స్ఫూర్తితో అన్నదాత సుఖీభవ పథకానికి సైతం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి పథకానికి కూడా కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తాజాగా ప్రకటించింది. ఈరోజు ఈ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read:  ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని నిర్ణయం
ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో( APS RTC ) ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కానుంది. అయితే ఈ పథకానికి సంబంధించి మహిళలకు జీరో పేరో టికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు? ఉచిత ప్రయాణంతో వారికి డబ్బులు ఎంత ఆదా అయ్యాయి? 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టిక్కెట్లు ఉండాలని స్పష్టంగా చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. అంటే ఆర్టీసీలో ప్రయాణించే ప్రతి మహిళకు జీరో ఫెయిర్ టికెట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న లబ్ధి, దాని ద్వారా ఎలా ప్రయోజనం చేకూరుతుంది అనేది వారికి స్పష్టమయ్యే అవకాశం ఉంది.

అన్ని వివరాలతో టిక్కెట్లు..
కేవలం ఆధార్ కార్డు( Aadhar card) చూపిస్తే ఉచిత ప్రయాణం కల్పిస్తే మహిళలకు ప్రభుత్వం ఉదారత అర్థమయ్యే అవకాశం లేదు. అందుకే వారికి ఇచ్చే జీరో ఫేర్ టిక్కెట్ పై అన్ని వివరాలు పొందుపరచాలని నిర్ణయించారు. ఎందుకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈరోజు సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం పై అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పై ఎంత భారం పడనుంది? ఎంతమంది మహిళలు ప్రయాణించే అవకాశం ఉంది? అదనంగా ఎన్ని బస్సులు అవసరం అవుతాయి? అన్న విషయాలపై అధికారులతో చర్చించారు. హామీ ఇచ్చిన మాదిరిగానే ఆగస్టు 15 నుంచి సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు.

Also Read: ఆడగాలి తగిలితే కానీ ఊపిరి ఆడదు.. ఢీ షోలో జాలిరెడ్డిగా మారిన హైపర్ ఆది!

ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టి..
అయితే మహిళలకు ఉచిత ప్రయాణ పథకంతో ( free travelling scheme)ఆర్టీసీ పై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఏపీఎస్ఆర్టీసీ. అందుకే ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎందుకుగాను ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. మొత్తానికైతే ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version