Dhee Dance Show:హైపర్ ఆది(Hyper Aadi) ఎంట్రీతో ఢీ డాన్స్ రియాలిటీ(Dhee dance reality show) షోకి కామెడీ యాంగిల్ యాడ్ అయ్యింది. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ గ్యాప్ లో హైపర్ ఆది కామెడీ పంచులు అలరిస్తాయి. కొన్నాళ్లుగా హైపర్ ఆది ఢీ షోకి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. ఓ సీజన్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్, దీపికా పిల్లి, హైపర్ ఆది సందడి చేశారు. ఈ సీజన్ మంచి ఆదరణ దక్కించుకుంది. రష్మీ గౌతమ్-సుధీర్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ కావడంతో దీపికా పిల్లితో హైపర్ ఆదికి ముడి పెట్టారు. ఈ రెండు జంటలు ఢీ షో లో రొమాన్స్ కురిపించాయి.
ఆ సీజన్ సక్సెస్ అయినప్పటికీ నెక్స్ట్ సీజన్ లో సుధీర్, రష్మీ, దీపికా పిల్లిని తప్పించారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. హైపర్ ఆది మాత్రం కొనసాగుతున్నాడు. రెండు దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఢీ షో…ప్రస్తుతం సీజన్ 20లోకి అడుగుపెట్టింది. కొత్తగా జడ్జి కుర్చీలోకి హీరోయిన్ రెజీనా కాసాండ్రా వచ్చింది. బిన్నీ మాస్టర్ మరొక జడ్జిగా ఉన్నాడు. ఇక నటుడు నందు కొన్ని సీజన్స్ నుండి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
అనసూయ నిష్క్రమణ తో జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన సౌమ్యరావు… ఢీ లేటెస్ట్ సీజన్లో సందడి చేస్తుంది. సౌమ్యరావును జబర్దస్త్ నుండి తప్పించిన సంగతి తెలిసిందే. కాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఢీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ‘ఇది సర్ మా ఢీ బ్రాండు’ అని యాంకర్ నందు పుష్ప డైలాగ్ చెప్పాడు. మహేష్ బాబు రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది… బిజినెస్ మెన్ చిత్రంలోని పాప్యులర్ డైలాగ్ ని అనుకరించి అలరించాడు. పనిలో పనిగా సౌమ్యరావు మీద పంచ్ వేశాడు. చిట్టి నీమీద పడ్డాడు అంటే అలేఖ్య చిట్టీ ఫికిల్ అయిపోతావ్ … అంటూ నవ్వించాడు.
Also Read: ‘నీ ఒడిలో తలవాల్చుకొని ఏడవాలని ఉంది’.. బ్రహ్మానందం మాటలకు నవ్వు ఆపుకోలేకపోయి పవన్
సడన్ గా ఢీ టైటిల్ విన్నర్ సంకేత్ ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాటకు అతడు డాన్స్ చేశాడు. సాంగ్ ముగిసిన వెంటనే జడ్జి రెజీనా వద్దకు వెళ్లి… గులాబీ ఇచ్చాడు. ఆమె శ్రీవల్లి.. నువ్వు పుష్ప అయితే.. నేను జాలిరెడ్డినా… అని హైపర్ ఆది పంచ్ వేశాడు. ఆర్ ఆర్ లో ‘వాడికి ఆడగాలి తగలకపోతే ఊపిరి కూడా ఆడదు’ అని పుష్పలో కేశవ చెప్పిన డైలాగ్ పడింది. మొత్తంగా బుల్లితెర మీద అమ్మాయిలను ఏడిపించే జాలిరెడ్డి తానని హైపర్ ఆది చెప్పకనే చెప్పాడు.
