AP Women Free Bus Pass: ఏపీ ప్రభుత్వం( AP government ) మరో ప్రతిష్టాత్మక పథకాన్ని రేపటి నుంచి ప్రారంభించనుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. స్త్రీ శక్తి పథకం పేరిట ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీచేసింది. మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు అవకాశం ఇచ్చింది. విద్యార్థులతో పాటు బాలికలు ఇకనుంచి ఉచిత, రాయితీ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించిన నగదు మొత్తం ప్రభుత్వమే చెల్లించనుంది.
ఎన్నికల హామీగా..
అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీలో( APSRTC ) ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఈ పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా మహిళలతో పాటు విద్యార్థినులు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు సైతం ఉచితంగా ప్రయాణం కల్పించనున్నారు. ఈనెల 11న ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందిస్తున్నారు.
Also Read: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఆ రూట్లలో ఉండదు!
1. ఈ ఉచిత పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి.
2. బాలికలతో పాటు మహిళలు కు మాత్రమే ఉచిత ప్రయాణ అవకాశం.
3. ట్రాన్స్ జెండర్లకు సైతం ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.
4. అయితే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, రేషన్ కార్డు కానీ తప్పనిసరి.
5. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది.
6. ప్రీమియం బస్ సర్వీసులు గా ఉన్న నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సూపర్ డీలక్స్, ఏసీ ఇంద్ర బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం లేదు.
7. ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ లలో సైతం ఉచిత ప్రయాణానికి అవకాశం ఉండదు.
Also Read: ఉచిత బస్సు ప్రయాణం… కూటమి ప్రభుత్వానికి అదే పెద్ద మైనస్ కానుందా?
8. తిరుమల- తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
9. కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు.
10. చార్టెర్డ్ సర్వీసుల్లో కూడా వర్తించదు.
11. వివిధ పుణ్యక్షేత్రాలతో పాటు ఘాట్ రోడ్లలో తిరిగే బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణానికి అవకాశం లేదని తెలుస్తోంది.