Telangana Beer Sales: మద్యపానం హానికరం అని ప్రతి మద్యం అమ్మే చోట సైతం బోర్డులు ఉంటాయి. కానీ మందుబాబులు అవేమీ పట్టించుకోకుండా ప్రతిరోజూ మద్యం తీసుకుంటూ ఉంటారు. ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు రకరకాల ఒత్తిళ్లు.. శారీరకంగా కష్టపడేవారు ఒళ్లు నొప్పుల నుంచి విముక్తి పొందడానికి మద్యం ఎంతో మేలు చేస్తుందని కొందరి భావన. రాత్రి రెండు పెగ్గులు వేయకుండా కొందరికి నిద్ర కూడా పట్టే అవకాశాలు ఉండవు. అయితే ఈ రెండు పెగ్గులు విష్కీ మంచిదా? లేక బీరు మంచిదా? అంటే ఎక్కువ శాతం బీరు కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గత పదేళ్ల లెక్కలు చూస్తే ఎర్ర మందు కంటే ఎక్కువగా బీరు తాగినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా గ్రామాలకు చెందిన వారే ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
National Inistitute Of Public And Policy (NIPFP) అనే సంస్థ మద్యం వినియోగంపై సర్వే చేసింది. ఈ సర్వేలో 2011-12 నుంచి 2022-23 వరకు వివరాలు తీసుకున్నారు. ఈ వివరాల ప్రకారం దేశంలో తెలంగాణ రాష్ట్రం బీరు వినియోగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి సగటున బీరు కోసం రూ.3,061 ఖర్చు చేసినట్లు తేలింది. దేశంలో సగటున రూ.486 గా ఉంది. దీనితో పోలిస్తే తెలంగాణలో మద్యం వినియోగించే వారి సంఖ్య ఆరు రేట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలుతోంది. ధూమపాన విషయంలో తెలంగాణ 5వ స్థానంలో ఉన్నట్లు ఈ సంస్థ తెలిపింది.
Also Read: రేవంత్‌కన్నా కేసీఆరే బెటరంట..! తాజా సర్వే సంచలనం!
తెలంగాణలో సరదా కోసం మద్యం తాగేవారు కొందరుంటే.. కొన్ని పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో తప్పనిసరిగా మద్యంను ఉంచుతారు. అయితే విష్కీ, వైన్ కంటే ఎక్కువగా బీర్లకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. వేసవి కాలంలో అయితే బీర్లు దొరకని పరిస్థితి ఏర్పడతుంది. ముఖ్యంగా యువకులు ఒక్కచోటికి చేరితే బీర్లకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కొన్ని నెలల కింద బీర్ల ధరలు రూ. 20 అధికంగా పెంచినా.. వీటి అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వస్తున్న విషయం తెలిసింది.
తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినా దసరా సమయంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దాదాపు మద్యం అలవాటు ఉన్నవారు తప్పకుండా సేవిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని కుటుంబాల్లో పండుగ వాతావరణం ఉండేలా మద్యం వినియోగిస్తూ ఉంటారు. అయితే మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయని కొందరు వైద్యలు హెచ్చరిస్తున్నారు. కానీ దీర్ఘకాలిక వ్యాధుల కంటే తాత్కాలికంగా గుండెకు ఎంతో మేలు చేస్తుందని కొందరు చెబుతూ ఉన్నారు.