AP Weavers: అటువంటి వాళ్ళు బ్యాంకు నుంచి తాము తీసుకున్నారు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తే బాగుంటుంది అని కూడా అనుకుంటూ ఉంటారు. అటువంటి ఒక శుభవార్త ప్రభుత్వం వాళ్లకు అందిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఒక శుభవార్త తెలిపింది. ప్రభుత్వం చేనేత కార్మికులు తీసుకున్న అప్పుల్లో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే ఈ రుణం వాళ్లు ఏప్రిల్ ఒకటి, 2017 నుంచి మార్చి 31, 2024 మధ్యలో తీసుకున్నది అయి ఉండాలి. చేనేత కార్మికులు తీసుకున్న ఈ రుణంలో అసలు మరియు వడ్డీ కలిపి లక్ష రూపాయలు వరకు మాఫీ అయ్యే అవకాశం ఉంది. అంతకుమించి వాళ్లకు అప్పు ఉన్నప్పటికీ అందులో కేవలం లక్ష రూపాయలు వరకు మాత్రమే మాఫీ అవుతుంది. దీనిలో మరొక కండిషన్ కూడా ఉందని తెలుస్తుంది. రుణం తీసుకున్న వాళ్లు కేవలం చేనేత కార్మికులు మాత్రమే అయి ఉండాలి. లేదా వాళ్ళు చేనేత ఉత్పత్తుల కోసం తీసుకున్నవారు అయ్యి ఉండాలి. లేదా వాళ్ళు చేనేత యంత్రాలు, పరికరాలు కొనడానికి రుణం తీసుకుని ఉండాలి.
Also Read: ఎన్టీఆర్ కు భారతరత్న.. సానుకూలంగా మోడీ!
చేనేత వృత్తికి సంబంధించిన వాళ్లకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ ఇస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల మంది చేనేత కార్మికులకు ప్రభుత్వ అందించిన ఈ వార్త చాలా ఊరట కలిగిస్తుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం 33 కోట్ల రూపాయలను ఈ ఏడాది మార్చి నెలలోనే విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఈ డబ్బు చేనేత కార్మికుల లబ్ధిదారుల అకౌంట్లో జమ కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అందించిన గైడ్లైన్స్ ప్రకారం డబ్బును లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అవడానికి జిల్లా స్థాయిలో కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
డబ్బును లబ్ధిదారుల అకౌంట్లో చేరవేసేందుకు ఈ కమిటీలు చాలా కీలకం కానున్నాయి. అప్పు తీసుకున్న వారితో ఈ కమిటీలు మాట్లాడతాయి. రుణమాఫీకి వాళ్లు అర్హులో కాదో ఈ కమిటీలు నిర్ణయిస్తాయి. అలాగే బ్యాంకులో నుంచి కూడా రుణం తీసుకున్న లబ్ధిదారుల జాబితాను ఈ కమిటీలు సేకరిస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన ఒక వారంలో లబ్ధిదారుల అకౌంట్లో రుణమాఫీని ప్రభుత్వం ఆమోదిస్తుంది. అంటే రుణమాఫీ పొందడానికి ఇప్పటినుంచి పది రోజుల సమయం పడుతుంది. రుణమాఫీ అయిన వాళ్లు ఆ తర్వాత కొత్తగా మళ్లీ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.