AP Weather: ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా.. సాయంత్రానికి మేఘావృతమై వర్షాలు పడుతున్నాయి. అయితే అవి కూడా భారీ వర్షాలు నమోదు కావడం లేదు. తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తాలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితి ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు పడుతుండడంతో ప్రజలు సైతం అయోమయానికి గురవుతున్నారు.
Also Read: ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సై.. మూడు గ్రూపులుగా 59 కులాలు!
* కొన్ని జిల్లాల్లోనే వర్షాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రత( Summer Heat) ఒకే మాదిరిగా ఉంది. కానీ వర్షాలు మాత్రం కొన్ని జిల్లాలకే పరిమితం అవుతున్నాయి. ఉదయం నుంచి ఎండలు మండుతుండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఎండలు తీవ్రత అధికంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా.. వర్షాలు పడుతుండడంతో చల్లటి వాతావరణం ఉంటుంది. గురువారం నాడు నంద్యాల జిల్లా గోస్పాడు, రుద్రవరంలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. కడప, తిరుపతి, కర్నూలు జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తుంది. వేంపల్లి లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. తిరుపతి జిల్లా మంగ నెల్లూరులో 41.4, కర్నూలులో 40.7° మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
* ఉత్తరాంధ్రలో వర్షాలు
ఈరోజు వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు( North Andhra) వర్ష సూచన ఉంది. ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్రవడగాలులు, 83 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని పేర్కొంది విపత్తుల నిర్వహణ సంస్థ. కాగా వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఉరుములతో కూడిన పిడుగులు పడవచ్చని హెచ్చరిస్తున్నారు.
Also Read: ఏపీలో ఎస్సీ వర్గీకరణ.. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ.. 59 ఉప కులాలు టర్న్!