Anasuya Hyper Aadi Controversy: అనసూయ-హైపర్ ఆది వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనసూయ స్వయంగా హైపర్ ఆది కారణంగానే జబర్దస్త్ వదిలేశానంటూ ఆరోపణలు చేసింది. ఈ వాదన గతంలో కూడా వినిపించింది. ఈ ఆరోపణల మీద హైపర్ ఆది వివరణ ఏంటి? హైపర్ ఆది సంచలన వీడియో వైరల్ గా మారింది.
Also Read: భర్త తో ఈ రేంజ్ రొమాన్స్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
దాదాపు దశాబ్దకాలం పాటు జబర్దస్త్ యాంకర్ గా కొనసాగారు అనసూయ. 2022లో అనూహ్యంగా ఆమె తప్పుకున్నారు. లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని ఎందుకు వదిలేసింది? కారణాలు ఏమిటనే చర్చ జరిగింది. ఈ క్రమంలో పలు వాదనలు తెరపైకి వచ్చాయి. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలనే జబర్దస్త్ కి దూరం అవుతున్నాని మొదట్లో అనసూయ అన్నారు. కొన్నాళ్ల తర్వాత తన అసహనం బయటపెట్టింది. కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడేవారు. మనం కోప్పడినా దాన్ని ఎడిటింగ్ లో తీసేసేవారని అనసూయ ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే టీఆర్పీ స్టంట్స్ నచ్చడం లేదని అనసూయ ఓ సోషల్ మీడియా ఛాట్ లో వెల్లడించారు.
అనసూయ జబర్దస్త్ మానేయడానికి డేట్స్ అడ్జస్ట్మెంట్ మాత్రమే కారణం కాదని ఆమె తీరును బట్టి అర్థం అవుతుంది. దాంతో హైపర్ ఆది పేరు తెరపైకి వచ్చింది. హైపర్ ఆది తీరు నచ్చని అనసూయ ఆ షోని వదులుకున్నారంటూ కామెంట్స్ వినిపించాయి. తాజాగా అనసూయ ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించింది. జబర్దస్త్ 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఎపిసోడ్ రూపొందించారు. ఈ ఎపిసోడ్ లో అనసూయ, హైపర్ ఆది సైతం పాల్గొన్నారు. అనసూయ మీద హైపర్ ఆది పంచ్ వేయగా… ఇందుకే నేను జబర్దస్త్ మానేసింది, అంటూ ఓపెన్ అయ్యింది.
Also Read: జబర్దస్త్ లో రష్మీకి గడ్డుకాలం… పొట్టి బట్టల్లో స్టార్ యాంకర్ కి షాకిస్తున్న లేడీ కమెడియన్
కాగా గతంలో ఈ ఆరోపణల మీద హైపర్ ఆది స్పందించాడు. జోర్దార్ సుజాత హోస్ట్ చేసిన టాక్ షోలో ఆమె ప్రశ్నకు సమాధానంగా… నావల్లే అనసూయ జబర్దస్త్ మానేసింది అనడంలో నిజం లేదు. ఆ సమయంలో అనసూయకు పుష్ప 2, పెదకాపుతో పాటు ఒక వెబ్ సిరీస్లో మంచి పాత్రలు వచ్చాయి. దాంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక అనసూయ జబర్దస్త్ నుండి తప్పు కుంది. నిజానికి నా స్కిట్స్ లో చేయడం ఆమె ఎంజాయ్ చేసేది. అనసూయ కేవలం నా స్కిట్స్ లో నటించింది… అని హైపర్ ఆది అన్నాడు. హైపర్ ఆది పాత వీడియో వైరల్ అవుతుంది.