AP Tsunami Warning: మనదేశంలో గుజరాత్ తర్వాత అతిపెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు పేరుంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాంతాలలో సముద్ర రవాణా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతాలలో వర్షాలు కురిసినప్పుడు.. సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడినప్పుడు సముద్రపు నీరు ముందుకు వస్తుంది. అలల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో వర్షాకాలం సముద్రపు ఎగపోటు అధికంగా ఉంటుంది. అలలు ఉప్పొంగుతాయి. ఇక్కడ వర్షాకాలంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుంది. నీరు తీవ్రంగా రావడం వల్ల తీర ప్రాంతం నిత్యం కోతకు గురవుతూ ఉంటుంది.
ఈసారి వర్షాకాలంలో అంతర్వేది ప్రాంతంలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిత్యం ఈ ప్రాంతంలో సముద్రం అలలతో ఉప్పొంగుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం 500 మీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోయింది. అంతేకాదు తీర ప్రాంతం కూడా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోయింది. గతంలో ఎన్నడు కూడా ఇలా చూడలేదని గ్రామస్తులు అంటున్నారు. గతంలో సముద్రం ఇలా వెనక్కి వెళ్లినప్పటికీ సముద్ర మేటల వల్ల అలా జరిగి ఉండేదని.. ఇప్పుడు భయంగా ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 500 మీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోయిన సముద్రం ఏ క్షణమైన సరే ముందుకు రావచ్చని.. నష్టాన్ని కలగజేయవచ్చని ఇక్కడి మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అంతర్వేది తీరంలో సముద్రపు అలలు బీభత్సాన్ని సృష్టించేవి. వర్షాకాలంలో దారుణమైన అనుభవాన్ని మిగిల్చేవి. కానీ ఇప్పుడు మాత్రం సముద్రపు అలలు రాకపోగా.. సముద్రమే వెనక్కి వెళ్ళిపోయింది. అది కూడా 500 మీటర్ల వెనక్కి వెళ్లిపోవడం స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.”వర్షాకాలంలో సముద్రం నీరు విపరీతంగా వచ్చేది. అలలు కూడా అదే స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు సముద్రపు నీరు వెనక్కి వెళ్ళిపోయింది. చూస్తుంటే ఏదో ప్రమాద హెచ్చరిక లాగా కనిపిస్తోంది. ఒండ్రు మట్టి కూడా విస్తారంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కావడం లేదని” స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ పరిణామాన్ని సునామీకి ముందస్తు హెచ్చరిక అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
అంతర్వేదిలో 500 మీ. వెనక్కి వెళ్లిన సముద్రం | 10TV#Antarvedi #tsunami #SustainableDevelopment #EnvironmentalImpact #AndhraPradesh pic.twitter.com/imFiTyHEty
— 10Tv News (@10TvTeluguNews) September 29, 2025