AP Theatres Bandh Issue: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. దాదాపు సినీ ప్రముఖుల నుంచి కిందిస్థాయి కార్మికుల వరకు తమ సంతోషం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో సినీ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురు కావడమే దీనికి కారణం. తమకు నచ్చిన హీరోల టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇస్తూ.. తమ వ్యతిరేకుల చిత్రాలను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏకంగా సినిమా ధియేటర్లలోకి తాసిల్దారులను పంపించి అడ్డంకులు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అటు సినీ ప్రముఖులు అప్పటి సీఎం జగన్ ను కలిసేటప్పుడు తగిన మర్యాద ఇవ్వలేదని కూడా విమర్శలు చెలరేగాయి. ప్రత్యేకంగా చిత్ర పరిశ్రమకు రాయితీలు లేకుండా పోయాయి. హైదరాబాదు నుంచి చిత్ర పరిశ్రమను ఏపీకి రప్పించే ఏర్పాట్లు కూడా జరగలేదు. ఇన్ని కారణాలతో చిత్ర పరిశ్రమ యావత్ కూటమికి మద్దతు తెలిపింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చిత్ర పరిశ్రమ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ సరిగ్గా ఎటువంటి సమయంలోనే థియేటర్స్ బంద్ తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని అడ్డుకోవడం ద్వారా.. సినీ పరిశ్రమలో అడ్డగోలు చీలికకు ప్లాన్ చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా దీని వెనుక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Also Read: Tollywood : టాలీవుడ్ కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు..?
* తూర్పుగోదావరి తో మొదలు..
రాష్ట్రవ్యాప్తంగా సినిమా ధియేటర్లు( cinema theatres ) లీజు ప్రాతిపదికన నడుస్తున్నాయి. అందులో ఎక్కువ ధియేటర్లు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలుగా ఉన్నవారు లీజులు పొందారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ థియేటర్లు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్ల బంద్ అంశం తూర్పుగోదావరి జిల్లాలో ముందుగా తెరపైకి రావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏప్రిల్ మూడో వారంలో అక్కడ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఒక సమావేశం జరిగింది. అందులో సయోధ్య కుదరలేదు. దీంతో జూన్ 1 నుంచి ధియేటర్స్ బందు చేస్తామని ఎగ్జిబిటర్స్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇది క్రమేపి విస్తరించింది. అయితే ఇది పక్క ప్లాన్ తో జరిగినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో చిత్ర పరిశ్రమ అంత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చీలిక తెచ్చి పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకత పెంచాలన్నది వైసిపి ప్లాన్ గా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ పన్నాగం పన్నినట్లు సమాచారం.
* వ్యాపార సంబంధాలు..
తెలుగు చిత్ర పరిశ్రమలో( Telugu cine industry) ఒక ప్రముఖ నిర్మాతతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యాపార భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. సదరు నిర్మాత స్టూడియో విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కోట్లాది రూపాయల భూమి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటినుంచి కూటమి ప్రభుత్వంపై సదరు నిర్మాత ఆగ్రహంగా ఉన్నారట. అందుకే తూర్పుగోదావరి జిల్లాలో ఒక సమావేశం నిర్వహించి.. ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ అన్న గొడవ క్రియేట్ చేసి.. చిత్ర పరిశ్రమలో చీలిక తేవాలన్నది ఒక ప్లాన్ అని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ మొత్తం స్కెచ్ మాత్రం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దేనని బయట ప్రచారం జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిఘా వర్గాలు పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాతే ఆయన దీనిపై ప్రత్యేక ప్రకటన చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సినీ పెద్దలు చేతులు కలపడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోయినట్లు తెలుస్తోంది.
* చిత్ర పరిశ్రమకు అనుకూలం..
కూటమి ( Alliance ) అధికారంలోకి వచ్చిన తరువాత చిత్ర పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. అక్కినేని నాగార్జునకు జగన్మోహన్ రెడ్డి తో మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన కలిసిన వారిలో నాగార్జున ఒకరు. అయినా సరే కూటమి ప్రభుత్వం అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ విడుదల సమయంలో టిక్కెట్ల ధర పెంచడానికి అనుమతిస్తూ జీవో జారీచేసింది. తమకు మద్దతు ఇవ్వని వారికి సైతం మద్దతు తెలిపింది. ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానినే గుర్తు చేశారు కూడా. అయితే చిత్ర పరిశ్రమలో గొడవ జరిగేలా చేయాలనేది వైసిపి వ్యూహంగా స్పష్టమైంది. కేవలం ఇది పైకి థియేటర్స్ గొడవగా కనిపిస్తోంది. ఇది చిన్న వివాదం. కానీ చిలికి చిలికి తుఫానుగా మారింది. చివరకు థియేటర్స్ నిర్వహణపై తనిఖీలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించే వరకు పరిస్థితి వచ్చింది. మొత్తానికైతే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నాలు.. తిరిగి ఆ సినీ సూత్రధారుల మెడకు చుట్టుకున్నట్లు అయ్యింది.