Homeఆంధ్రప్రదేశ్‌AP Stree Shakti Scheme Guidelines: ఏపీలో ఆ రూట్లలో ఉచిత ప్రయాణానికి నో ఛాన్స్!

AP Stree Shakti Scheme Guidelines: ఏపీలో ఆ రూట్లలో ఉచిత ప్రయాణానికి నో ఛాన్స్!

AP Stree Shakti Scheme Guidelines: ఏపీలో( Andhra Pradesh) ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పేరుతో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. మిగతా ప్రీమియర్ సర్వీసులుగా ఉన్న లగ్జరీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, సూపర్ డీలక్స్, ఏసీ బస్సుల్లో మాత్రం ఆ అవకాశం లేదు. పొరుగు రాష్ట్రాలుగా ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా కు తిరిగే ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్లో సైతం ఈ పథకం వర్తించదు.

ఏపీవ్యాప్తంగా చాలా రూట్లో..
అయితే ఏపీవ్యాప్తంగా చాలా ఘాట్ రోడ్లు( Ghat roads ) ఉన్నాయి. ప్రధానంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన మార్గాలన్నీ ఘాట్ రోడ్లలోనే ఉన్నాయి. ఆ రూట్లలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తే భక్తులతో పాటు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. రోడ్డు భద్రత దృష్ట్యా అది ఏమంత క్షేమం కాదు. అందుకే ఘాట్ రోడ్లలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అనుమతి ఇవ్వలేదు. ఉచిత పథకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీచేసినప్పుడే ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రహదారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఘాట్ రోడ్లలో సామర్థ్యం, మోతాదుకు మించి ప్రయాణాలు చేయకూడదు. అది నిబంధనలకు విరుద్ధం కూడా. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: క్షమాపణలు చెప్పాల్సిన దుస్థితి టిడిపి ఎమ్మెల్యేకు ఎందుకు వచ్చింది?

ఈ రూట్లో అధికం..
తిరుమల- తిరుపతి దేవస్థానంలో ఘాట్ రోడ్లు ఉన్నాయి. శ్రీశైల దేవస్థానానికి సంబంధించి కూడా ఘాట్ రోడ్లు ఉన్నాయి. సాధారణంగా ప్రముఖ దేవస్థానాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఘాట్ రోడ్లను ఆశ్రయించాలి. ముఖ్యంగా తిరుమల నుంచి తిరుపతికి సప్తగిరి బస్సులు తిరుగుతుంటాయి. వీటిలో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. అలాగే అన్నమయ్య రాయచోటి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఘాట్ రోడ్లు అధికం. ఆ రూట్లలో మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణం లేదు. అయితే దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్టీసీ ప్రత్యేక నోటీస్ బోర్టులు కూడా పెడుతోంది. ప్రయాణికుల భద్రత, రహదారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో స్పష్టం చేసింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version