TDP MLA Anjaneyulu Apologizes: వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరించారని.. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని.. అనేక దందాలు చేశారని టిడిపి నాయకులు ఆరోపిస్తుంటారు. వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల ఏపీ రాష్ట్రం వెనుకబడిపోయిందని మండిపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు తమకు అధికారాన్ని ఇచ్చారని చెబుతుంటారు. కానీ టిడిపి ఎమ్మెల్యేలు ప్రజలకు ఏ స్థాయిలో సేవలు అందిస్తున్నారో.. ఏ స్థాయిలో అందుబాటులో ఉంటున్నారో మాత్రం చెప్పారు.
కూటమి ప్రభుత్వం లోకి వచ్చిన తర్వాత సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళ మాధవి, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారాలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో కోనేటి ఆదిమూలాన్ని ఏగంగా టిడిపి సస్పెండ్ చేసింది. మీరు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు.. మంత్రులు కూడా దందాలు చేస్తున్నారని.. అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు వారు చేస్తున్న వ్యవహారాలను వీడియోలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నారు. సదరు ఎమ్మెల్యేలు చేస్తున్న ఘనకార్యాలు టిడిపి అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
తాజాగా శుక్రవారం జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆంజనేయులు వ్యవహార శైలి సంచలనం సృష్టించింది. ఆయన జాతీయ జెండా రూపంలో వేసిన ముగ్గును షూ ధరించి దాటారు. జెండా రూపంలో ఉన్న ముగ్గును ఆయన తొక్కుకుంటూ వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో శుక్రవారం నుంచి ఈ వీడియో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసిపి అనుకూల మీడియా ఆంజనేయులుకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తోంది. ఇది కాస్త కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారి నేపథ్యంలో వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు స్పందించక తప్పలేదు. ఆయన ఒక స్వీయ వీడియోలో జరిగిన ఉదంతానికి సంబంధించి వివరణ చేశారు. చివరికి తనను క్షమించాలని కోరారు..
Also Read: శ్రీకృష్ణ జన్మాష్టమి.. వైఎస్ జగన్ ట్వీట్ వైరల్
“ప్రజలు మొత్తం నన్ను క్షమించాలి. విషమంటే నాకు చాలా భక్తి ఉంది. జాతీయ జెండా అంటే కూడా ఎంతో గౌరవం ఉంది. ఈ ఘటన నన్ను తీవ్రమైన కలవరపాటుకు గురిచేస్తున్నది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాను. ఇది చూసుకోకుండా జరిగింది. ఇంకానాకు దానికి సంబంధించిన మనస్థాపన కొనసాగుతూనే ఉంది. భవిష్యత్ కాలంలో ఇలాంటివి జరగవని నేను హామీ ఇస్తున్నాను. నా ప్రత్యర్ధులు జరిగిన దానిని రాజకీయం కోసం వాడుకుంటున్నారు. అటువంటి విధానాలు సరికావని ఈ వీడియో ద్వారా చెబుతున్నానని” ఆంజనేయులు పేర్కొన్నారు.