Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) భూ వివాదాలు చెక్ చెప్పేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక మొబైల్ యాప్ ను( special mobile app) అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా భూ సంబంధిత సమస్యలకు చెక్ చెప్పాలని భావిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో భూ వివాదాలకు చెప్పేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సమస్యలు ఎక్కడికక్కడే వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చాలామందికి సంబంధించి భూముల వివరాలు, రికార్డుల్లో తమ భూమి ఉందా లేదా అన్న వివరాలు తెలుసుకోవడం కష్టతరంగా మారుతోంది. దీంతో కార్యాలయాలపై ఆధార పడాల్సి వస్తోంది. ఆ అవసరం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్తగా మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ యాప్ పనిచేయనుంది.
* ముమ్మర కసరత్తు
ఈ సరికొత్త మొబైల్ యాప్ ను( mobile app) అందుబాటులోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ( stamps and registrations department ) ముమ్మర కసరత్తు చేస్తోంది. ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ప్రవేశపెట్టనుంది. సక్సెస్ అయితే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. కార్డు 2, కార్డు 2.0 సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేయడం కోసం త్వరలో టెండర్లు కూడా పిలవబోతున్నారు. ఇది ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సైతం సరళతరం అవుతుందని భావిస్తున్నారు.
* సమగ్ర వివరాలు
కొత్తగా అందుబాటులోకి వచ్చే యాప్, సాఫ్ట్ వేర్లలో సర్వే ఆఫ్ ఇండియా( Survey of India), సాటిలైట్ చిత్రాలు, డిటిసిపి జాబితా, మునిసిపల్, సర్వే విభాగం, ఎఫ్ఎంబి, బ్యాంకుల్లో సమాచారం, భూముల చిత్రాలు ఒకే చోట కనిపించనున్నాయి. దీంతో ప్రజలు తమ భూముల వివరాలను చాలా సులువుగా చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్ని వివరాలు ఇట్టే పొందవచ్చు. భూమి దగ్గరకు వెళ్లి ఆ యాప్ ఓపెన్ చేస్తే దాని ప్రాథమిక వివరాలు తెలిసేలా పొందుపరిచి ఉంటాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే నకిలీ రిజిస్ట్రేషన్ల బెడద ఉండదు.
* రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిశాయి. ఎక్కువగా భూ సమస్యలపై ఎక్కువమంది అధికారులకు ఫిర్యాదు చేశారు. వాటిని సరిచేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్( special focus) పెట్టింది. వీలైనంతవరకు భూ సమస్యలకు చెప్పాలని చూస్తోంది. అందులో భాగంగానే మొబైల్ ప్రత్యేక యాప్ తో పాటు సాఫ్ట్ వేర్లు అందుబాటులోకి తేనుంది.