RYTHU BHAROSA GUIDELINES : తెలంగాణ రైతులు ఏడాదిగా ఎదురు చూస్తున్న రైతు భరోసా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిమితితో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. పంట వేసినా, వేయకపోయినా సాగుభూమి అయితే చాలని స్పష్టం చేసింది. సాగుభూములు కానివాటిని జాబితా తయారు చేయాలని కలెక్టర్లను ఆదేవించింది. మరోవైపు సాగుభూములకు జనవరి 26 నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎవరెవరు అర్హులు అనే విషయంలో రైతులకు అవగాహన ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పెట్టుబడిసాయం అందించడం ద్వారా ఉత్పాదకత పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతోపాటు ఆధునిక పద్ధతులు ఆచరించేందుకు అవసరమైన వనరులు సేకరించడానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాగు భూములకే భరోసా..
ఇక తాజాగా ఉత్తర్వల ప్రకారం.. గ్రామీణాభివృద్ధి, ఆహార భద్రతకు తోడ్పడడంతోపాటు గ్రాంమీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది. జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. భూభారతి ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌లో నమోదు అయిన వ్యవసాయ యోగ్యమైన భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సాయం అందించాలని ఉత్తర్వుల్లు పేర్కొంది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు భూములకు ఎలాంటి సాయం ఇవ్వమని స్పష్టం చేసింది.
ఎకరాకు రూ.12 వేలు..
ఇక తాజా ఉత్తర్వుల ప్రకారం సాగు యోగ్యమైన భూములకు, అటవీ హక్కుల చట్టం ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరోసా అందిస్తుంది. రిజర్వు బ్యాంకు నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతుభరోసా సాయం రైతుల ఖతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ఎకరాకు(రెండు పంటలకు కలిపి) రూ.12 చొప్పున సాయం అందిస్తామని పేర్కొంది. వ్యవసాయ శాఖ సంచాలకులు రైతుభరోసా పథకం అమలు చేస్తారని ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని తెలిపింది. జిల్లాల్లో రైతు భరోసా పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యులుగా ఉంట్టారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.